ప్రస్తుత కాలంలో మనిషిలో సహనం, ఓపిక అనేవి లేకుండా పోతున్నాయి.కుటుంబం అన్నాక తరచూ ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి.
కాసేపు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.అలాకాకుండా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి గొడవకు దిగితే ఆ కుటుంబం నాశనం అవ్వడానికి ఎక్కువ కాలం పట్టదు.
ఇలాంటి కోవలోనే భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి భార్య తల్లిని గొడ్డలితో నరికిన ఘటన యాదాద్రి జిల్లా( Yadadri District ) మోత్కురు మండలం రాగిబావి గ్రామంలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
మోత్కురు ఎస్సై ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.రాగిబావి గ్రామంలో( Ragibaavi Village ) నివాసం ఉండే జక్కుల పెంటయ్య, పిచ్చమ్మ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం.
చిన్న కుమార్తె వరమ్మ ను రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన నూక రమేష్ కు( Nooka Ramesh ) ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు.ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం.రమేష్ బతుకుతెరువు కోసం భార్య పిల్లలతో కలిసి హైదరాబాదులో ఉంటూ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.20 రోజుల క్రితం రమేష్, వరమ్మ దంపతుల మధ్య గొడవ జరిగింది.
రమేష్ తన భార్య వరమ్మ ను( Varamma ) కొట్టడంతో ఆమె తన పుట్టింటికి వచ్చింది.గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో పెద్ద మనుషులు భార్యభర్తలకి సర్ది చెప్పారు.ఓ నాలుగు రోజుల తర్వాత వరమ్మ హైదరాబాద్( Hyderabad ) వస్తుందని చెప్పడంతో రమేష్ వెళ్లిపోయాడు.భార్య వరమ్మ తిరిగి రాకపోవడంతో అత్త పిచ్చమ్మనే( Pichhamma ) తన భార్యను పంపడం లేదని భావించిన రమేష్ మంగళవారం అర్ధరాత్రి మద్యం సేవించి రాగిబావి గ్రామానికి వచ్చాడు.
మంచం పై నిద్రిస్తున్న అత్త పిచ్చమ్మపై గొడ్డలితో తలపై గట్టిగా నరికాడు.ఆమె కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయాడు.వెంటనే పిచ్చమ్మను కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గ్రామంలోనే దాక్కున్న రమేష్ ను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.