కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ( Atlee )దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్( Shahrukh Khan ) నయనతార ( Nayanatara ) జంటగా నటించిన చిత్రం జవాన్( Jawan ).పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ద్వారా నయనతార మొదటిసారి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్ తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ( Red Chillies )బ్యానర్ పై నిర్మించారు.
భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఇక ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలని పెంచేసాయి.
మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే.
కథ: భారత్, చైనా సరిహద్దులో ఉన్న ఒక గ్రామం దగ్గర ఉండే నదిలోకి కొట్టుకొస్తాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి (షారుక్ ఖాన్).తలకు పెద్ద దెబ్బ, ఒంటి నేను డబ్బులు లేట్లతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గ్రామస్తులు చూసి ఆయనని రక్షిస్తారు.ఇలా ఆ గ్రామంలోనే ఉన్నటువంటి ఆ వ్యక్తి గ్రామానికి ఆపద వస్తే ఆదుకుంటారు కానీ ఆయన గతం మాత్రం తనకు గుర్తు ఉండదు.30 సంవత్సరాల తర్వాత అతను ఆరుగురు అమ్మాయిలతో (ప్రియమణి, సాన్యా మల్హోత్రా గ్యాంగ్) మెట్రో ట్రైన్ హైజాక్ చేస్తాడు.తన పేరు విక్రమ్ రాథోడ్ అని అందరికీ తెలియజేస్తారు ఇలా మెట్రో ట్రైన్ హైజాక్ చేయడంతో ఈయనతో మాట్లాడటానికి ప్రభుత్వం తరఫున నర్మద (నయనతార) వస్తుంది.
ఇక షారుఖ్ ఖాన్ హైజాక్ చేసిన మెట్రో ట్రైన్ లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్, వెపన్స్ డీలర్ కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) కూతురు ఆలియా (ఆశ్లేష ఠాకూర్) కూడా ఉంటుంది.దీంతో ఆయన భారీగా డబ్బు డిమాండ్ చేస్తారు ఇలా వీరిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ సినిమాలో జైలర్ ఆజాద్ (మరో షారుక్ ఖాన్) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే పాత్రలో నటిస్తున్నటువంటి.
నటీనటుల పనితీరు: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్( Shahrukh Khan ) ఈ సినిమాలో మరోసారి తన నటన విశ్వరూపం చూపించారని చెప్పాలి.ఇక నయనతార కూడా యాక్షన్స్ సన్నివేశాలలో అధరగొట్టారు.ఇక విలన్ పాత్రలో నటించినటువంటి విజయ్ సేతుపతి కూడా షారుఖ్ ఖాన్ కు గట్టి పోటీ ఇస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.ఇక దీపికా పదుకొనే ప్రియమణి పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయి.
టెక్నికల్: డైరెక్టర్ అట్లీ ( Director Atlee )షారుఖ్ ఖాన్ కోరుకుంటున్నారో అంతకుమించి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ఆనిరుద్ అద్భుతంగా ఇచ్చారనే చెప్పాలి.
మ్యూజిక్ మరో లెవెల్ లో ఉంది.సినిమాటోగ్రఫీ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా సినిమాకి హైలెట్ గా నిలిచాయని తెలుస్తుంది.
విశ్లేషణ: ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అయితే ఈ సినిమాని ఒకసారి ఎంతో ఆసక్తిగా చూడవచ్చు మరోసారి కూడా ఈ సినిమా చూడాలని ఆసక్తి కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్: షారుక్ నటన, యాక్షన్ సన్ని వేషాలు, మ్యూజిక్ సినిమాకి హైలైట్ అయ్యాయి.నయనతార ఎంట్రీ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని బోరింగ్ కొట్టే సన్నివేశాలు.
బాటమ్ లైన్: సినిమా గురించి చివరగా చెప్పాల్సి వస్తే ఈ సినిమాతో షారుక్ ఫాన్స్ మాత్రం ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా కలెక్షన్లు సునామి సృష్టించడం ఖాయం అని తెలుస్తుంది.
రేటింగ్: 2.75/5