బిగ్ బాస్( Bigg Boss )షో సీజన్7 ద్వారా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో పల్లవి ప్రశాంత్ ఒకరు. రైతు ( Farmer )బిడ్డగా, కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చినా కొంతమంది మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న పల్లవి ప్రశాంత్ ఏ విధంగా కామన్ మ్యాన్ అవుతాడని కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ షోకు వెళ్లకముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పల్లవి ప్రశాంత్ ( Pallavi prashanth )అంటే ఆ పేరు నా పేరే అని నా పేరు వెనుక చరిత్ర అని ఆయన అన్నారు.మొక్కు వల్లే నేను ఈ పేరు పెట్టుకున్నానని ఆయన పేర్కొన్నారు.బిగ్ బాస్ షోలోకి రైతు బిడ్డ ఎందుకు వెళ్లకూడదని ఆలోచించి నేను ముందడుగు వేశానని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు.
నాన్న నాకు ఎంతో సపోర్ట్ చేశారని ఆయన కామెంట్లు చేశారు.యూట్యూబ్ ఛానల్ విషయంలో ఒక అక్క మోసం చేసిందని ఆయన అన్నారు.

కాళ్లు పట్టుకున్నా ఆ అమ్మాయి మోసం చేసిందని ఆమె ప్రస్తుతం తెలంగాణలో ( Telangana )ఫేమస్ అయిన వ్యక్తి అని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు.అలా మోసపోయానని తెలిసి చనిపోవాలని అనుకున్నానని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు.నన్ను మోసం చేసిన వాళ్లు ఆ తర్వాత కూడా నా గురించి కూడా చెడుగా మాట్లాడారని ఆయన చెప్పుకొచ్చారు.నన్ను మోసం చేసి వాళ్లు ఒక మంచి మనిషిని కోల్పోయారని ఆయన తెలిపారు.
నేను యూట్యూబ్ ఛానల్ పోగొట్టుకున్న తర్వాత భయపడ్డానని పల్లవి ప్రశాంత్ అన్నారు.ఒక్కోసారి నాన్న నా వీడియోలు షూట్ చేస్తారని ఆయన కామెంట్లు చేశారు.
ఏ జన్మలో ఏదో పుణ్యం చేయడం వల్లే నాకు మంచి నాన్న దొరికారని పల్లవి ప్రశాంత్ అన్నారు.పల్లవి ప్రశాంత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా</em( Social media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.







