అమీర్ ఖాన్( Aamir Khan ) అంటే తెలియని వారు లేరు.ఈయన బాలీవుడ్( Bollywood ) బడా హీరోల్లో ఒకరు.
కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ ను ఏలేస్తున్న హీరోల్లో అమీర్ కూడా ఒకరు.ఈయనకు మన టాలీవుడ్ హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి.
రామ్ చరణ్, నాగార్జున, చిరంజీవి వంటి స్టార్స్ తో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు.అయితే అమీర్ కు కోలీవుడ్ హీరోలతో పెద్దగా స్నేహం లేదు.
అందుకే ఈయన కోలీవుడ్ హీరోలతో కూడా స్నేహాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తుంది.మరి ఈ స్నేహాన్ని విజయ్ దళపతి తోనే స్టార్ట్ చేయనున్నారట.
విజయ్ సినిమాలో కీ రోల్ లో అమీర్ ఖాన్ నటించ బోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) తన 68వ సినిమాను( Thalapathy 68 ) కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వంలో చేయనున్నాడు.ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య విలన్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే టాక్ రాగ ఇప్పుడు అమీర్ ఖాన్ కీలక రోల్ లో నటించ బోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.తాజాగా ఈ సినిమాలో అమీర్ ఖాన్ ని కూడా ఏజిఎస్ ప్రొడక్షన్స్ వారు భాగం చేస్తున్నట్టు తెలుస్తుంది.అమీర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడానికి ఒప్పించారని దీని వెనుక విజయ్ ఉన్నట్టు సన్నిహిత వర్గాల నుండి లీక్ అయ్యింది.చూడాలి ఇందులో నిజమెంత ఉందో.







