ఇండియా పేరు భారత్ గా మారనుందా..గతంలో పేర్లు మార్చుకున్న దేశాలు ఇవే..!

ఇండియా పేరు భారత్ గా మారనుందా.? ప్రస్తుత దేశ రాజకీయ పరిమాణాల నేపథ్యంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.అసలు ఒక దేశం పేరు మార్చడం చాలా సులభమా.

 Will The Name Of India Change To Bharat , Bharat, India, Turkey, Sri Lanka, Myan-TeluguStop.com

గతంలో ఏ దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయో.అందుకు గల కారణాలు ఏమిటో చూద్దాం.

తుర్కియే:( Turkey ) 2022లో టర్కీ దేశం తన పేరును తుర్కియే గా మార్చుకుంది.ఆ దేశం పేరు మార్చుకోవడానికి ఓ అతి పెద్ద కారణం ఉంది.

అది ఏమిటంటే.? టర్కీ అనే పదానికి అర్థం మూర్ఖుడు, ఫెయిల్యూర్, సిల్లీ ఫెలో.దేశానికి ఉండే పేరు గొప్పగా ఉండాలి కానీ తక్కువ చేసేలా ఉండకూడదు.కాబట్టి తుర్కుల సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికత విలువలకు అద్దంపట్టేలా ఉండడం కోసం తుర్కియే గా పేరును మార్చుకున్నారు.

శ్రీలంక: ( Sri Lanka )మన భారతదేశానికి అడుగు దూరంలో ఉండే శ్రీలంకకు గతంలో చాలా పేర్లు ఉండేవి.విజయ అనే రాజు పాలించేటప్పుడు ఆ దేశాన్ని తంబపన్నీ అని పిలిచేవారు.రామాయణం ప్రకారం లంక అని పిలిచేవారు.పూర్వం క్రీ.శ.993 తరువాత ముమ్మిడి కోలమండలం అని పిలిచేవారు.ఆ తరువాత టాప్రోబానా, సారాందాబ్, సీలోన్ అనే పేర్లతో కూడా పిలవబడింది.1972లో సీలోన్ అనే పేరు శ్రీలంక గా మారింది.

మయన్మార్:( Myanmar ) 1989లో బర్మా దేశం తన పేరును మయన్మార్ గా మార్చుకుంది.ఈ దేశంలో బర్మన్ ప్రజలు మాట్లాడే భాష బర్మీస్/ మైన్మ/బామ.

ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనను అణిచివేసిన అనంతరం ఒక ఏడాది తర్వాత మయన్మార్ గా పిలువబడుతోంది.

చెకియా:( chekiya ) 1918లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది.అప్పుడు ఈ దేశాన్ని బోహెమియా గా పిలిచేవారు.1992లో చెక్ రిపబ్లిక్ గా ఏర్పడింది.2016 లో చెక్ రిపబ్లిక్ ను చెకియా గా పిలువాలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఎష్వతిని:( Eswati ) 2018లో స్వాజిలాండ్ పేరును ఎష్వతిని గా మార్చారు.స్వాజిలాండ్, స్విట్జర్లాండ్ రెండు పేర్లు కూడా దగ్గరగా ఉండటం వల్ల చాలామంది పొరపాటు పడుతూ ఉండడంతో దేశం పేరును మార్చారు.

కంబోడియా: ( Cambodia )1953-70 మధ్య కంపుచేయాను కింగ్ డమ్ ఆఫ్ కంబోడియా గా పిలిచేవారు.1975 తరువాత డెమోక్రటిక్ కంపుచేయాగా గా మార్చారు.1989లో స్టేట్ ఆఫ్ కంబోడియా గా మారింది.1993 తర్వాత మళ్లీ కింగ్డమ్ ఆఫ్ కంబోడియా గా మారింది.ప్రస్తుతం సింపుల్ గా కంబోడియా అని పిలుస్తున్నారు.

థాయిలాండ్: ( Thailand )గతంలో ఈ దేశాన్ని సియామ్, ముయాంగ్ థాయి అని పిలిచేవారు.1939లో థాయిలాండ్ గా మార్చారు.

కాంగో:( Congo ) గతంలో కాంగో లియోపోల్డివిల్లే, కాంగో ఫ్రీ స్టేట్, బెల్జియం కాంగో గా పిలిచేవారు.ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో గా మారింది.

ఇరాన్:( Iran ) 1935లో పర్షియా దేశం పేరు ఇరాన్ గా మారింది.

List of countries Changed their names

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube