బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ జవాన్( Jawan Movie )ఈ సినిమాతో ఎలాగైనా 1000 కోట్లు రాబట్టాలని షారుఖ్ ఖాన్ చాలా కష్ట పడుతున్నాడు.ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచేసి మొత్తం చుట్టేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూడగా ఈ వీకెండ్ లో రాబోతుండడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ పెరగడంతో పక్కా హిట్ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.‘పఠాన్( Pathaan )’ సినిమా హిట్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఫుల్ జోష్ తో జవాన్ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధంగా ఉంచాడు.

ఇక ఈ సినిమాతో షారుఖ్ రికార్డులను నెలకొల్పేలానే ఉన్నాడు.తెలుగులో కూడా ఎప్పుడు లేని విధంగా జవాన్ మానియా కనిపిస్తుంది.ఇదిలా ఉండగా జవాన్ లో ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అది ఏంటంటే ఈ సినిమాలో మూడు భాషల్లో ముగ్గురు హీరోలు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.వీరి ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

జవాన్ సినిమాలో తెలుగు వర్షన్ లో అల్లు అర్జున్( Allu arjun ), తమిళ్ వర్షన్ లో విజయ్ దళపతి, బాలీవుడ్ వర్షన్ లో సంజయ్ దత్ లు గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్టు టాక్ వస్తుంది.దీంతో ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ సర్ప్రైజ్ ఉంది అని మాత్రం ఫ్యాన్స్ నమ్ముతుండడంతో ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.మరి సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షారుఖ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.