మెగా వారి చిన్నబ్బాయి తిప్పలు.. ఊరించి ఉసూరుమనిపించాడు

మెగా ఫ్యామిలీ( Mega Family ) నుండి పలువురు హీరో లుగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఇప్పటికే రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ లు స్టార్‌ హీరోలు గా దూసుకు పోతున్నారు.

 Vaishnav Tej Films Back To Back Flaps,vaishnav Tej,flop Movies,uppena,ranga Rang-TeluguStop.com

ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌ తేజ్ కెరీర్ లో నిలదొక్కుకునేందుకు కష్టాలు పడుతున్నాడు.ఇదే సమయంలో వైష్ణవ్ తేజ్( Viashnav Tej ) ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు.

మెగా ఫ్యామిలీ లోనే కాకుండా ఇండస్ట్రీ లో ఏ హీరో కు దక్కని అరుదైన గౌరవం వైష్ణవ్ కు దక్కింది.మొదటి సినిమా తోనే వంద కోట్ల వసూళ్లు కేవలం వైష్ణవ్‌ కి మాత్రమే దక్కిందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

ఆ ఆనందం కొన్నాళ్ల కే పరిమితం అయింది.

ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కొండ పొలం, రంగ రంగ వైభవంగా సినిమా( Ranga Ranga Vaibhavam ga ) లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ఏమాత్రం ఆకట్టుకోని కథ మరియు కథనాలతో సినిమాలు వచ్చాయి అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయం లోనూ అభిమానులు సంతృప్తి తో కనిపించడం లేదు.ఇప్పటి వరకు వైష్ణవ్ నుండి ఒక మంచి ఫీల్ గుడ్‌ మూవీ వస్తుందని ఆశించిన అభిమానులకు వరుసగా నిరాశే మిగులుతూ ఉన్న కారణంగా ఆయన తో సినిమా లు చేయాలని భావిస్తున్న ఫిల్మ్‌ మేకర్స్( Film Makers ) ఒకటికి రెండు సార్లు కథ విషయం లో జాగ్రత్త లు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి సినిమా తో సక్సెస్ దక్కించుకుని ఇప్పుడు తిప్పలు పడుతున్న వైష్ణవ్‌ తేజ్ అభిమానులను ఊరించి ఉసూరుమనిపిస్తున్నాడు.కొండ పొలం సినిమా లో తన నటనతో మెప్పించినా కూడా కమర్షియల్‌ గా మాత్రం మరో మంచి బ్రేక్ కోసం వెయిట్‌ చేస్తున్నాడు.ఎప్పటికి ఆ బ్రేక్ దక్కుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube