ఇప్పటికే ఆశావాహుల నుంచి టికెట్ కోసం దరఖాస్తులు స్వీకరించిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఎంపిక చేసే విషయంపై పూర్తిగా దృష్టి సారించింది.స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న మురళీధరన్ ఆధ్వర్యంలో దీనిపై కసరత్తు జరుగుతుంది.
కొన్ని కొన్ని కీలక నియోజకవర్గల నుంచి సీనియర్ నేతలు చాలామంది టికెట్ కోసం దరఖాస్తులు పెట్టుకోవడంతో, ఎవరిని ఎంపిక చేయాలనేది క్లిష్టంగా మారింది.అభ్యర్థుల ఎంపిక ప్రకటన తర్వాత పార్టీలో పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ , అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇక తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ఆకస్మికంగా వచ్చారు.

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.అలాగే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) , ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ లతో అభ్యర్థుల బలాబలాల పైన సునీల్ కానుగోలు చర్చించినట్లు సమాచారం.పిఎసి ఇచ్చిన జాబితాను ఇప్పటికే సునీల్ కానుగోలు తయారుచేసిన జాబితాను పోల్చి చూసి సర్వే నివేదిక ఆధారంగా తయారుచేసిన మొదటి లిస్టును మురళీధరన్ కు అందజేశారు.
దీనిని రేవంత్ రెడ్డి , మధుయాష్కి గౌడ్ కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా అభ్యర్థులు ఎంపిక పైన , ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యవహాల పైన సునీల్ కానుగోలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం .కాంగ్రెస్ కు తెలంగాణలో గతంతో పోలిస్తే బాగా బలం పెరిగిందని. అధికార పార్టీ బి ఆర్ ఎస్ ను దీటుగా ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధిస్తుందని , బిజెపి విషయాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సునీల్( Sunil kanugolu ) చెప్పారట.

కర్ణాటక ఎన్నికల్లో సునీల్ కానుగోలు సత్తా ఏమిటో అందరికీ తెలియడం , అక్కడ ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో సునీల్ వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ నిర్వహించే వర్కింగ్ కమిటీ సమావేశాన్ని సక్సెస్ చేసేందుకు టీపీసీసీ నిన్ననే అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.సభ ఏర్పాట్లు కోఆర్డినేషన్ వర్క్ డివిజన్ పై చర్చ జరిపారు.ఇందిర భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, సి డబ్ల్యూ సి సభ్యులు దామోదర రాజనర్సింహ మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.







