సూర్యాపేట జిల్లా: బీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బీసీ జన గర్జన సభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్( Bolka Venkat Yadav ),ప్రముఖ వైద్యులు వూర రామ్మూర్తి యాదవ్పిలుపునిచ్చారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలె విగ్రహం వద్ద బీసీ జన గర్జన సభ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు( Political reservations ) కల్పించాలని,దేశంలో రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను ఇప్పటి వరకు అన్ని పార్టీలు రాజ్యాధికారానికి దూరంగా ఉంచారని అన్నారు.
ఇప్పటికైనా బీసీలు అందరు ఐక్యతతో రాజ్యాధికారం చేపట్టే విధంగా చైతన్యం కావాలని అన్నారు.అన్ని రాజకీయ పార్టీలు బీసీ లకు 60% రాజకీయ రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.
బీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగే బీసీ జనగర్జన సభకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు ముషం రవికుమార్( Ravi kumar ), బెంజారపు రమేష్, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు గుండాల సందీప్,పేర్ల గిరి, మస్కాపురం ప్రవీణ్,సిద్ది రాము,సతీష్,జటంగి ఫణి యాదవ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.