టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఓజీ( OG ).ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.తాజాగా వదిలిన ఫస్ట్ గ్లింప్స్ తో ఈ సినిమాపై ఆ అంచనాలు మరింత పెరిగాయి.ఈ ఏడాది ఆఖరిలోపు ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.అలాగే ఈ సినిమా రీమేక్ కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
దీంతో మార్కెటింగ్ కు మంచి ఎంక్వయిరీలు మొదలయ్యాయి.ముందుగా ఓవర్ సీస్ డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఓవర్ సీస్ ను 13 కోట్ల రేటుకు ఫారస్ ఫిలింస్ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవల పవన్ సినిమాలతో పోల్చుకుంటే మంచి రేటు అనే చెప్పాలి.అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా భీమ్లా నాయక్ కూడా తొమ్మిది కోట్ల రేంజ్ కు ఇచ్చారు. 13 కోట్లు( OG Overseas ) అంటే మంచి రేటే.
అలాగే కొన్న వాళ్లకు కూడా మంచి డీల్ నే అని తెలుస్తోంది.ఇటీవల సినిమా ఏమాత్రం బాగున్నా ఓవర్ సీస్ కలెక్షన్లు బాగుంటున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో పవన్ క్రేజ్ కూడా నడుస్తోంది.ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.
ఇటీవల బ్రో సినిమా( Bro Movie )తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఉన్నాయి.వైపు రాజకీయాలలో బిజీబిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ).అయితే ప్రస్తుతం కేవలం రాజకీయాలలో మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అన్న కసితో రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.