ఇంకా కొన్ని నెలల్లో తెలంగాణ( Telangana ) రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతోంది.ఈ తరుణంలోనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు రంగంలోకి దిగి ప్రచారంలో మునిగిపోయారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్( BRS ) అధికారంలో ఉంది.ఈసారి బిఆర్ఎస్ ని ఎలాగైనా పడగొట్టి గద్దెనెక్కాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయి.
దానికోసం అనేక వ్యూహాత్మక ఆలోచనలు చేస్తున్నాయి.ఇదే తరుణంలో అన్ని పార్టీల నాయకులు రకరకాల సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నాయి.
ఇక పార్టీల సర్వేలు అంటే చాలామందికి గుర్తుకువచ్చేది ప్రశాంత్ కిషోర్.
తాజాగా ప్రశాంత్ కిషోర్ ( Prashanth kishore ) తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ పార్టీకే ఛాన్స్ ఉందని అన్నారు.
ఆ వివరాలు ఏంటో చూద్దాం.ప్రశాంత్ కిషోర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐప్యాక్ అనే సంస్థను స్థాపించి దేశంలోని చాలా రాజకీయ పార్టీలకు సర్వేల ద్వారా సహకారం అందిస్తున్నారు.
తన ఐప్యాక్ సర్వే ద్వారా ఇప్పటికే టీఎంసీ,డిఎంకే, వైయస్సార్సీపి ( YSRCP ) వంటి పార్టీలకు ఎన్నో సేవలందించారు.
ఆయన చేసిన సర్వేల ద్వారా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో క్లియర్ గా చెప్తూ ఉంటారు.అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది ఏ పార్టీనో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ మళ్లీ గెలిచే ఛాన్స్ ఉందని అన్నారు.
అలాగే రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లో బిజెపి,కాంగ్రెస్ ( Congress ) మధ్య గట్టి పోటీ ఉంటుందని తెలియజేశారు.ఛత్తిస్ ఘడ్ లో కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు కానీ పోటీ ఏర్పడుతుంది.ఇక తెలంగాణ విషయానికి వస్తే తప్పకుండా బిఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలియజేశారు.
ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోతున్నారు.