నేపాల్ పై భారత్ గ్రాండ్ విక్టరీ..సూపర్-4 చేరిన భారత్..!

తాజాగా ఆసియా కప్( Asia Cup ) లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సూపర్-4 రౌండ్ కు చేరుకుంది.భారత ఫీల్డర్లు నిరాశ పరచగా.

 India's Grand Victory Over Nepal India Joins Super-4 , Asia Cup , India , Nepal,-TeluguStop.com

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 74, శుబ్ మన్ గిల్ 67 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగారు.అయితే వర్షం పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించిన చివరికి రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో నేపాల్ ను చిత్తుగా ఓడించింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆల్ అవుట్ అయింది.నేపాల్ జట్టు ఓపెనర్లైన అసిఫ్ షేక్ 58, సొంపాల్ 48 పరుగులతో రాణించారు.నేపాల్ బ్యాటర్లు 49 ఓవర్ల పాటు అద్భుతంగా పోరాడారు.భారత్ పేలవ ఫీల్డింగ్ తో తొలి 5 ఓవర్లలోనే మూడు క్యాచ్లు డ్రాప్ చేయడం వల్ల నేపాల్ జట్టుకు బాగా కలిసి వచ్చింది.

భారత జట్టు బౌలర్ శార్థూల్ ఠాగూర్( Shardul Thakur ) పదవ ఓవర్లో కుశాల్ ను అవుట్ చేసి భారత్ కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు.ఇక రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసుకొని నేపాల్ బ్యాటర్లను కాస్త కట్టడి చేశాడు.మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

మహమ్మద్ షమీ కి ఒక వికెట్ లభించింది.నేపాల్ జట్టు 230 పరుగుల లక్ష్యాన్ని భారత్ కు ఇచ్చింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత్ 2.1 ఓవర్లలో 17 పరుగులు చేసిన తర్వాత వర్షం వల్ల దాదాపుగా రెండు గంటల వరకు మ్యాచ్ కు అంతరాయం కలిగింది.దీంతో అంపైర్లు ఇన్నింగ్స్ ను 23 ఓవర్లకు కుదించి 145 పరుగుల టార్గెట్ ను ఇచ్చారు.అప్పటికి 20.5 ఓవర్లలో భారత్ కు 128 రన్స్ అవసరం ఉండగా భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్( Rohit sharma ) అర్థ సెంచరీలతో చెలరేగి 20.1 ఓవర్లలో 147 పరుగులు చేసి భారత్ కు ఘనవిజయం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube