నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”.
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్స్ అందుకున్న బాలయ్య ఈ సినీరంతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.అయితే గత కొద్దీ రోజుల నుండి బాలయ్య సీరియస్ పాత్రలనే చేస్తున్నాడు.
యాక్షన్ అండ్ సీరియస్ రోల్స్ తో మెప్పిస్తున్నప్పటికీ ఈయన నుండి కామెడీ కూడా ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో యాక్షన్ ఉన్నప్పటికీ కామెడీ మాత్రం హిలేరియస్ గా అనిల్ రావిపూడి సెట్ చేసాడని తెలుస్తుంది.

బాలయ్య ”బాబాయ్ అబ్బాయ్” సినిమా( Babai Abbai ) తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో కామెడీ సినిమా చేయలేదు.ఇన్నేళ్లకు ఈ సినిమాతో అలాంటి జోనర్ లో సినిమా వస్తుంది.దీంతో బాలయ్యను జోవియల్ లుక్ లో చూసి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో ఈయన కామెడీ టైమింగ్ కూడా సూపర్ అని అంటున్నారు.

ఇక దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.అందుకే మొన్ననే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.మరి ఈయన కెరీర్ లో ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఇక బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( , Kajal Aggarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల,( Sreeleela ) విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.
ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.







