చిరంజీవి, పవన్ కళ్యాణ్ సీఎం కావడం చిన్న విషయం.. శివాజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్లలో శివాజీ ఒకరు.96 సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్న శివాజీ బిగ్ బాస్ షోకు వెళ్లడానికి కొన్ని గంటల ముందు జాఫర్ తో వీడియో కాల్ లో మాట్లాడగా ఆ కాల్ లో చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ షోలో నటించనని ఆయన తెలిపారు.

 Shivaji Sensational Comments About Chiranjeevi Pawan Kalyan Details Here Goes Vi-TeluguStop.com

నేను సినిమాల్లో సక్సెస్ అని రెండెకరాల రైతు కొడుకు అయిన నేను భారీ సంఖ్యలో సినిమాలలో నటించడం అంటే గ్రేటే కదా అని ఆయన అన్నారు.నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేనని బీజేపీ నుంచి కూడా బయటకు వచ్చానని శివాజీ చెప్పుకొచ్చారు.నేను ప్రజల గొంతుక అని శివాజీ కామెంట్లు చేశారు.

ప్రజల తరపున ఎవరు తప్పు చేసినా అడుగుతానని ఆయన అన్నారు.ఈరోజు నేను 50 లక్షల రూపాయల కారుతో తిరుగుతున్నానని శివాజీ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గారు చిన్న తప్పు వల్ల సీఎం కాలేకపోయారని ఆ లోపం ఏంటో నాకు తెలుసని ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ సీఎం కావడం సులువు అని 2029లో ఇది సాధ్యమవుతుందని శివాజీ తెలిపారు.ఇది నా దృష్టిలో నా విషయంలో చిన్న విషయంలో శివాజీ( Shivaji ) కామెంట్లు చేశారు.నేను ప్రజలు అన్యాయమైపోతే తట్టుకోలేకపోయానని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమా వాళ్లు సెన్సిటివ్ పీపుల్ అని శివాజీ పేర్కొన్నారు.బిగ్ బాస్ కంటెస్టెంట్లు మన పిల్లలు అని ఆయన తెలిపారు.తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదని శివాజీ అన్నారు.

నాకు రాజకీయాలు వద్దు అని ఆయన చెప్పుకొచ్చారు.నేను నిజాయితీగా పని చేయడం వల్లే ఆఫర్లు వచ్చాయని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube