ఇటీవలే కాలంలో హత్యలు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోతోంది.హత్య చేయడానికి చాలానే కారణాలు ఉండొచ్చు.
కానీ సమస్యలకు పరిష్కారాలు వెతకకుండా నేరుగా హత్యలకు పాల్పడుతూ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.ఇలాంటి కోవలోనే ఓ మైనర్ విద్యార్థి( Minor Student ) లైంగిక వేధింపులను భరించలేక ట్యూటర్ ను( Tutor ) హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో( Delhi ) చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.
ఢిల్లీలోని జాకీర్ నగర్ లో వసీమ్ (28)( Waseem ) కుటుంబం నివాసం ఉంటోంది.వసీమ్ ఓ ప్రైవేట్ ట్యూటర్ గా పనిచేస్తున్నాడు.
జామియా నగర్ లో ఉన్న ఓ మైనర్ విద్యార్థికి ట్యూషన్ చెప్పేవాడు.అయితే ఆగస్టు 30న ట్యూటర్ వసీంను ఆ మైనర్ విద్యార్థి పేపర్ కట్టర్ తో హత్య చేశాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న వసీంను చూసిన ఆ మైనర్ విద్యార్థి తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల ప్రాథమిక విచారణలో ట్యూటర్ వసీంను మైనర్ విద్యార్థి పేపర్ కట్టర్ తో( Paper Cutter ) హత్య చేసినట్లు తేలింది.

పోలీసులు ఆ మైనర్ విద్యార్థిని ఏం జరిగిందని అడుగగా.ఇంట్లో ఎవరూ లేని సమయంలో వసీం తనను లైంగికంగా పలుమార్లు వేధించాడని తెలిపాడు.అంతేకాదు లైంగికంగా వేధిస్తున్నప్పుడు వీడియోలు కూడా తీశాడని, ఆ వీడియోలు చూపించి తనను బెదిరించి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక తాను ఇలా హత్య చేశాడని తెలిపారు.పోలీసులు మైనర్ విద్యార్థిని అరెస్టు చేశారు.







