బూట్లు, చెప్పులు పట్టుకుని స్యూల్ కు విద్యార్థులు.. కారణం ఇదేనట!

మనదేశంలోని బీహార్‌ ( Bihar )గురించి మనకి అనేక కధలు వినిపిస్తూ వుంటాయి.ఈ క్రమంలో అక్కడ గ్రామాల అభివృద్ధికి సంబంధించి అనేక వాదనలు మనం నిత్యం వార్తలలో చూస్తూ వుంటాము.

 Students Go To Seoul Holding Shoes And Sandals This Is The Reason, Students , Go-TeluguStop.com

అయితే స్కూల్ లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. బెగుసరాయ్( Begusarai ) జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ చిత్రంలో స్టడీ మెటీరియల్‌ తీసుకుని వెళ్లే బదులు.పిల్లలు స్లిప్పర్‌లను చేతిలో పట్టుకుని ఉన్నారు.

దానిని బట్టే అర్ధం అవుతోంది ఈ పిల్లలు స్కూల్‌కి చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని.

Telugu Sandals, Seoul, Shoes-Latest News - Telugu

అవును, మనకి ఈ చిత్రంలో కన్పిస్తుంది.వర్షం కురిసినప్పుడు కనిపించే ఘటన కాదు.ఈ దృశ్యం ఏడాది పొడవునా అక్కడ మనకి కనబడుతుంది అంటే మీరు నమ్ముతారా? బీహార్ విద్యావ్యవస్థను బట్టబయలు చేయడానికి ఈ ఒక్క చిత్రం చాలు.ఈ పాఠశాల జిల్లాలోని మంఝాల్ పంచాయతీ( Manjhal Panchayat ) పరిధిలో ఉంది.ఇక్కడ చదువుకోవడానికి వచ్చే పిల్లలకు చదువు కంటే బడికి చేరుకోవడమే ఓ పెద్ద సవాల్.

పిల్లలను బడికి పంపే విషయంలో రైతులతో వాగ్వాదం జరగడంతో వారిని బడికి పంపడం మానేసినట్లు గ్రామస్తులు అక్కడ చెప్పడం చాలా బాధాకరం.అక్కడ స్యూల్ కు వెళ్లే మార్గం సరిగ్గా లేదు.

అంతే కాకుండా.ఏడాది పొడవున ఏ కొంచెం వర్షం పడిన కూడా.

మార్గం అంతా నీటితో నిండిపోతుంది.

Telugu Sandals, Seoul, Shoes-Latest News - Telugu

ఈ కరణంగానే విద్యార్థులు ఇతర మార్గాలు, పొలాల నుంచి స్కూల్ కు వెళ్తుంటారు.ఇలాంటి సమయంలో నీటిలో పడకుండా.చేతిలో చెప్పులు, బూట్లు పట్టుకుని వెళుతూ వుంటారన్నమాట.

ఈ పాఠశాల దాదాపుగా 2007 నుండి నడుస్తోంది.ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం సగటున 160 మంది పిల్లలు ఐదో తరగతి వరకు చదువుకోవడం జరుగుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 165 మంది పిల్లలకు బోధించే బాధ్యతను 6గురు ఉపాధ్యాయులకు అప్పగించారు.ఆ దారుణమైన మార్గాన్ని అధిగమించి చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన కొందరు చిన్నారులు మాట్లాడుతూ.

పాఠశాలకు వస్తున్నప్పుడు చేతిలో చెప్పులు, పుస్తకాలు, కాపీలు తలపై పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube