బూట్లు, చెప్పులు పట్టుకుని స్యూల్ కు విద్యార్థులు.. కారణం ఇదేనట!

మనదేశంలోని బీహార్‌ ( Bihar )గురించి మనకి అనేక కధలు వినిపిస్తూ వుంటాయి.

ఈ క్రమంలో అక్కడ గ్రామాల అభివృద్ధికి సంబంధించి అనేక వాదనలు మనం నిత్యం వార్తలలో చూస్తూ వుంటాము.

అయితే స్కూల్ లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది.బెగుసరాయ్( Begusarai ) జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ చిత్రంలో స్టడీ మెటీరియల్‌ తీసుకుని వెళ్లే బదులు.పిల్లలు స్లిప్పర్‌లను చేతిలో పట్టుకుని ఉన్నారు.

దానిని బట్టే అర్ధం అవుతోంది ఈ పిల్లలు స్కూల్‌కి చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని.

"""/" / అవును, మనకి ఈ చిత్రంలో కన్పిస్తుంది.వర్షం కురిసినప్పుడు కనిపించే ఘటన కాదు.

ఈ దృశ్యం ఏడాది పొడవునా అక్కడ మనకి కనబడుతుంది అంటే మీరు నమ్ముతారా? బీహార్ విద్యావ్యవస్థను బట్టబయలు చేయడానికి ఈ ఒక్క చిత్రం చాలు.

ఈ పాఠశాల జిల్లాలోని మంఝాల్ పంచాయతీ( Manjhal Panchayat ) పరిధిలో ఉంది.

ఇక్కడ చదువుకోవడానికి వచ్చే పిల్లలకు చదువు కంటే బడికి చేరుకోవడమే ఓ పెద్ద సవాల్.

పిల్లలను బడికి పంపే విషయంలో రైతులతో వాగ్వాదం జరగడంతో వారిని బడికి పంపడం మానేసినట్లు గ్రామస్తులు అక్కడ చెప్పడం చాలా బాధాకరం.

అక్కడ స్యూల్ కు వెళ్లే మార్గం సరిగ్గా లేదు.అంతే కాకుండా.

ఏడాది పొడవున ఏ కొంచెం వర్షం పడిన కూడా.మార్గం అంతా నీటితో నిండిపోతుంది.

"""/" / ఈ కరణంగానే విద్యార్థులు ఇతర మార్గాలు, పొలాల నుంచి స్కూల్ కు వెళ్తుంటారు.

ఇలాంటి సమయంలో నీటిలో పడకుండా.చేతిలో చెప్పులు, బూట్లు పట్టుకుని వెళుతూ వుంటారన్నమాట.

ఈ పాఠశాల దాదాపుగా 2007 నుండి నడుస్తోంది.ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం సగటున 160 మంది పిల్లలు ఐదో తరగతి వరకు చదువుకోవడం జరుగుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 165 మంది పిల్లలకు బోధించే బాధ్యతను 6గురు ఉపాధ్యాయులకు అప్పగించారు.

ఆ దారుణమైన మార్గాన్ని అధిగమించి చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన కొందరు చిన్నారులు మాట్లాడుతూ.

పాఠశాలకు వస్తున్నప్పుడు చేతిలో చెప్పులు, పుస్తకాలు, కాపీలు తలపై పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.

మనిషివేనా.. ఇలా చేస్తే తినేవాళ్లు పరిస్థితి ఏమైనా ఆలోచించావా?