థ్రెడ్స్‌ వాడుతున్నట్టైతే ఈ టిప్స్‌ మీకోసమే గురూ!

ఇక్కడ ట్విట్టర్ అంటే ఏమిటో తెలియనివారు అంటూ ఎవరూ వుండరు.ఇక దానికి పోటీగా వచ్చినదే థ్రెడ్స్‌( Threads ) అని కూడా అందరికీ తెలుసు.

 If You Are Using Threads Then These Tips Are For You Guru, Technology Updates, T-TeluguStop.com

అవును, ట్విట్టర్‌(ఎక్స్‌)ను బలంగా ఢీ కొట్టడానికి ఇన్‌స్టాగ్రామ్‌ అందుకున్న అస్త్రమే ఈ థ్రెడ్స్‌.కస్టమర్‌కు విశేషమైన సేవలు అందించే లక్ష్యంతో సిద్ధమైన థ్రెడ్స్‌ ఇప్పుడు సోషల్‌ నెట్‌వర్క్‌లో సంచలనం సృస్టిస్తోంది అని చెప్పుకోవచ్చు.

ఈతరం బయటి ప్రపంచంతో కన్నా ఆన్‌లైన్‌ వరల్డ్‌తోనే ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నదని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.ఆలోచనలు, ఆనందాలు, భావోద్వేగాలు, సందేశాలు, వార్తలు ఇలా అన్నిటినీ షేర్‌ చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలే సరైన వేదికగా భావిస్తున్నాయి.

Telugu Latest, Ups, Threads, Tips-Latest News - Telugu

ఇపుడు చాలావరకు కాలక్షేపానికి సోషల్‌ మీడియాని ఆశ్రయిస్తున్నారు.ఈ క్రమంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్లు ( Facebook , Twitter )అభిప్రాయాలు పంచుకునే వేదికలుగా నిలిచాయి.వాటితో పోల్చుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌( Instagram ) అంతకుమించిన థ్రిల్‌ పంచుతున్నదని చెప్పుకోవచ్చు.ఫొటోలు, వీడియోలు, రీల్స్‌ షేర్‌ చేస్తూ వారివారి టాలెంట్‌ను ఇక్కడ అనేకమంది నిరూపించుకుంటున్నారు.రక్షణతోపాటు విలక్షణ ఆప్షన్స్‌ కలగలసిన థ్రెడ్స్‌ ఇన్‌స్టాలో సబ్‌మాడ్యుల్‌లా వచ్చి చేరడంతో యూజర్లకు కొత్త కిక్‌ లభించినట్టయింది.థ్రెడ్స్‌ లాంచ్‌ అయిన మొదటి రెండు గంటల్లోనే 20 లక్షల మందిని ఆకర్శించింది అంటే మీరు ఇక అర్ధం చేసుకోవచ్చు.

Telugu Latest, Ups, Threads, Tips-Latest News - Telugu

ఆ తరువాత మొదటి నాలుగు గంటల్లోనే 50 లక్షలమంది సైన్‌ ఇన్‌ అయ్యారంటే థ్రెడ్స్‌ కెపాసిటీ ( Capacity of threads )ఏమిటో మీరు అర్ధం చేసుకోవచ్చు.ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో కనెక్ట్‌ అయ్యే అవకాశం ఇపుడు థ్రెడ్స్‌ కల్పిస్తుంది.దగ్గరి నేస్తాలతో ఒక కమ్యూనికేషన్‌ ఏర్పర్చుకోవచ్చు.అదే విధంగా మీ స్టేటస్‌ కేవలం మీ సన్నిహితులు మాత్రమే చూసేలా కూడా చేసుకొనే వీలుంది.ఇక థ్రెడ్స్‌లో కెమెరా సెంట్రిక్‌ ఇంటర్‌ఫేస్‌ కొత్త అనుభూతిని మీకు కలిగిస్తుంది.అందుకని మీరు ఇక్కడ లైవ్‌ చిత్రాలు, వీడియోలు ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవచ్చు.

ఇక ఇక్కడ ఆటోమెటిక్‌ షేరింగ్‌ గురించి మాట్లాడుకోవాలి.వినియోగదారులు తాము ఎంచుకున్న స్నేహితులతో మీరు అనుకున్న సమాచారాన్ని, వీడియోలు, ఫొటోలను ఆటోమెటిక్‌గా షేర్‌ చేసుకునే వెసులుబాటు థ్రెడ్స్‌ కల్పిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube