తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలన్నీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల దరఖాస్తు ఫారం చర్చనీయాంశంగా మారింది.అప్లికేషన్ ఫారంలో క్రిమినల్ కేసుల వివరాలను అడుగుతోంది బీజేపీ.
కేసులు ఎన్ని ఉన్నా సవివరంగా చెప్పాలని పేర్కొంది.ఈ రాష్ట్ర నాయకత్వం దరఖాస్తు ఫారంను నాలుగు విభాగాలుగా రూపొందించింది.
ఇందులో భాగంగా మొదటి విభాగంలో వ్యక్తి బయోడేటా, రాజకీయ కార్యక్రమాలు ఉండనున్నాయి.రెండో విభాగంలో గతంలో పోటీ చేసిన వివరాలు, వచ్చిన ఓట్ల వివరాలు,.
మూడో విభాగంలో పార్టీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యత, నాలుగో విభాగంలో క్రిమినల్ కేసులుంటే వాటి వివరాలు, శిక్ష పడిన కేసుల వివరాలు తెలియజేసే విధంగా దరఖాస్తు ఫారంను రూపొందించారు.దీంతో రాజకీయ వర్గాల్లో బీజేపీ దరఖాస్తు ఫారం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.