తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Heroine Samantha ), సింగర్ చిన్మయిల గురించి మనందరికీ తెలిసిందే.వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
గతంలో ఎన్నో సార్లు సమంతకు సంబంధించిన విషయాలలో సింగర్ చిన్మయి స్పందిస్తూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేశారు.మరి ముఖ్యంగా విడాకుల వ్యవహారం సమయంలో నెటిజన్స్ సమంత పై దారుణంగా ట్రోల్స్ చేసిన సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచింది సింగర్ చిన్మయి.
ఇది ఇలా ఉంటే తాజాగా సింగర్ చిన్మయి( Singer Chinmayi ) సమంతను ఉద్దేశిస్తూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.

అందరి దృష్టిని ఆకర్షించి డబ్బులు సంపాదించడం కోసం అసభ్యకరంగా మాట్లాడితే ఏదో ఒక రోజు ఇబ్బంది ఎదుర్కొంటారు.అలాగే ఎన్ని నిందలు ఎదురైనా హుందాగా ముందుకు ఎలా సాగాలో నేర్చుకోవాలంటే ఆ విషయంలో సమంతను స్ఫూర్తిగా తీసుకోండి.తన అనారోగ్యం( Samantha Health ) కారణంగా ఒక ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది.ఆ ప్రాజెక్ట్ కోసం తన పారితోషికాన్ని తగ్గించుకుంది.వచ్చే డబ్బును వద్దనే వారు ఈ కాలంలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు.సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చినప్పుడు.
తాను మయోసైటిస్( Myositis )తో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పి.ఆ సమస్యపై అందరికీ అవగాహన కల్పించడానికి తాను ఎంతో కష్టపడుతోంది.
అలాగే ఈ అమ్మాయి కెరీర్ అయిపోయింది అని పలువురు కామెంట్‌స్ చేస్తున్న సమయంలో కూడా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అవకాశాలు అందుకుంటూ వెళ్లి తన సత్తా చాటుతోంది.

అదేవిదంగా ఎవరు ఎన్ని రకాలుగా దూషించినా, అసభ్యకరంగా మాట్లాడినా కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది.ట్విటర్‌లో ఎంగేజ్‌మెంట్స్, మానిటైజేషన్ అనే గోలతో కొంతమంది ఇటీవల నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు.కర్మ సిద్ధాంతం అనేది ఎంతో ఆసక్తి కలిగిన అంశం.
ఒకరి గురించి అదే పనిగా అబద్ధాలు చెబుతూ దూషిస్తూ ఉంటే ఆ పాపం మొత్తం పేరుకుని ఏదో ఒకరోజు మనకే ఎదురుతిరుగుతుంది.డబ్బులు సంపాదించినా.ఆస్తులు ఉన్నా ఏం లాభం లేదు.తరతరాలకు ఆ కర్మ ఫలం వర్తిస్తుంది.
అది ఒక్కసారి మొదలైతే.వినోదం మామూలుగా ఉండదు అంటూ ఆమె చురకలు అంటించారు.







