అలాంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్ షోకు మైనస్.. తెలుగు రాని వాళ్లను ఎందుకు రుద్దుతారంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) గ్రాండ్ గా ప్రారంభమైంది.ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ షో సీజన్7 మొదలు కాగా హీరోయిన్ల పర్ఫామెన్స్ లు లేకుండానే గత సీజన్లకు భిన్నంగా ఈ షో ప్రసారం కావడం గమనార్హం.

 These Contestants Minus For Bigg Boss Show Details Here Goes Viral In Social Med-TeluguStop.com

అయితే బిగ్ బాస్ షో సీజన్7 లో చాలామంది కంటెస్టెంట్లు తెలుగు ప్రేక్షకులకు చిరాకు తెప్పించే విధంగా మాట్లాడుతున్నారు.తెలుగు భాషను కొంతమంది కంటెస్టెంట్లు ఖూనీ చేస్తున్నారు.

తెలుగురాని వాళ్లను బిగ్ బాస్ షోలోకి తీసుకోవడం ఎందుకని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఒకరిద్దరు కంటెస్టెంట్లు అయితే పరవాలేదని ఎక్కువమంది కంటెస్టెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం సరికాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగురాని వాళ్లను ఎందుకు రుద్దుతారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

ఇలాంటి కంటెస్టెంట్ల( contestants ) వల్ల బిగ్ బాస్ షోకు నష్టమే తప్ప లాభం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షో సీజన్7 ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో సక్సెస్ సాధించడం నాగార్జునకు( Nagarjuna ) కూడా కీలకమని చెప్పవచ్చు.

బిగ్ బాస్6 ఫ్లాప్ అయిన సమయంలో నాగార్జునపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ సీజన్ కు అయినా నాగార్జున పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు.బిగ్ బాస్ షో సీజన్7 సక్సెస్ సాధిస్తే మాత్రమే తర్వాత సీజన్లు ఉంటాయని తెలుస్తోంది.బిగ్ బాస్ షో సీజన్7 ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

బిగ్ బాస్ షో తెలుగులో ఎన్నో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది.బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ఎలాంటి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube