సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu _ లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.( Guntur Kaaram ) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రతీ అభిమాని ఎదురు చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.మరి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.
వస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం.మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అనే టాక్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో త్రివిక్రమ్ పవన్ గొంతును వినిపించనున్నాడట.గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది కాబట్టి కథ చాలా కీలకం.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అయితే కథ పరంగా నేపధ్యానికి వాయిస్ ను బాగా చెబుతూ కథలోకి తీసుకు వెళ్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుంది అని త్రివిక్రమ్ ప్లాన్ చేశారట.ఇలా చేస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా గుంటూరు కారం సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.దీంతో ప్లాన్ ప్రకారం పవన్ తో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పించారట.గతంలో జల్సా సినిమా కోసం మహేష్ వాయిస్ ఓవర్ చెప్పడంతో చాలా ప్లస్ అయ్యింది.
ఇక ఇప్పుడు పవన్ వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో శ్రీలీల,( SreeLeela ) మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
ఈ సినిమా తెలుగులో మాత్రమే కాదు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.