డెడ్లీయెస్ట్‌ మిసైల్‌ని బయటకు తీసిన రష్యా.. వదిలితే ఒకేసారి కోటి మందికి పైగా..!!

రష్యా దేశం దాని అత్యంత విధ్వంసక అణు క్షిపణి అయిన RS-28 సర్మత్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM)ని తాజాగా బయటకు తీసింది.దీనిని “సాటాన్ II”( Satan II ) అని కూడా పిలుస్తారు.

 Russia Has Taken Out The Deadliest Missile, Rs-28 Sarmat Icbm, Satan Ii, Nuclear-TeluguStop.com

రష్యా ఈ భయంకరమైన వెపన్‌ను యూజ్ చేయడానికి సిద్ధం కావడమనేది ఇతర దేశాలకు, ముఖ్యంగా నాటోలో చేరాలని భావిస్తున్న వారికి హెచ్చరికగా పరిగణించడం జరుగుతోంది.సర్మత్ ICBM 10-15 అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.

ఇది 10,000 నుంచి 18,000 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది.ఇది కేవలం 14 నిమిషాల్లో తన లక్ష్యాన్ని చేరుకోగలదు, దీనిని అడ్డగించడం చాలా కష్టం.

ఉక్రెయిన్‌పై దాడి చేయడం వల్ల పశ్చిమ దేశాల నుంచి రష్యా పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ఈ సమయంలోనే ఆ దేశం సర్మత్ ఐసీబీఎమ్( Sarmat ICBM ) ప్రవేశ పెట్టడం జరిగింది.ఈ చర్య రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.సర్మత్ ఐసీబీఎమ్ గురించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఈ బాలిస్టిక్ మిస్సైల్ పొడవు 116 మీటర్లు, బరువు 220 టన్నులు.ఇది గంటకు 18,000 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు.

రష్యా-పశ్చిమ ప్రతిష్టంభనలో సర్మత్ ICBMని కాంబ్యాట్ సేవల్లోకి తీసుకురావడం ఒక ముఖ్యమైన పరిణామం.అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధమని రష్యా స్పష్టమైన సంకేతం పంపడం.

ఈ పరిణామం ఆందోళన కలిగిస్తుంది.దీనిని అన్ని దేశాలు తీవ్రంగా పరిగణించాలి.

ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్( Federation of American Scientists ) ప్రకారం, 10 వార్‌హెడ్‌లతో కూడిన ఒక సర్మాట్ ICBM, ఒక్కొక్కటి 100 కిలోటన్నుల యీల్డ్‌తో కోటి మందిని చంపగలదు.అయినప్పటికీ, వార్‌హెడ్‌ల పేలుడు, వేడి, రేడియేషన్ కూడా నష్టం, విధ్వంసాన్ని కలిగిస్తుంది కాబట్టి, మరణాల వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చు.సర్మత్ ICBM మల్టిపుల్ టార్గెట్స్‌ను హిట్ చేయదగిన రీ-ఎంట్రీ వాహనాలను (MIRVs) మోసుకెళ్లగలదు, అంటే ఇది ఒకే ప్రయోగంతో మల్టిపుల్ లక్ష్యాలను చేధించగలదు.ఇది మరింత వినాశకరమైనది, ఎందుకంటే ఇది ఒకే దాడిలో ఎక్కువ మందిని చంపగలదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube