టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత చేపట్టిన “యువగళం” ( yuvagalam )పాదయాత్ర నేడు పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించడం జరిగింది.నిన్నటి వరకు ఏలూరు జిల్లాలో యాత్ర సాగింది.
జనవరి 27వ తారీకు ప్రారంభమైన ఈ యాత్ర 200 రోజులకు పైగా పూర్తి చేసుకుని 2,700 కిలోమీటర్లకు పైగా నడుస్తూ లోకేష్( Lokesh ) ముందుకు సాగుతున్నారు.నేడు “యువగళం” పాదయాత్ర ఏలూరు జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.ఈ క్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో యువనేత నారా లోకేష్‌కి చేపల గజమాలతో టీడీపీ కార్యకర్తలు మరియు నాయకులు లోకేష్ కి ఘన స్వాగతం పలికారు.
400 కేజీల చేపలతో ఈ గజమాల తయారు చేయడం జరిగింది.పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇవ్వడంతో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు స్వాగతం పలికారు.పాదయాత్రలో తన దృష్టికి ప్రజలు తీసుకొస్తున్న ప్రతి సమస్య పట్ల లోకేష్ స్పందిస్తూ భరోసా ఇస్తున్నారు.
మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party )కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేస్తూ ఉన్నారు.







