టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Raviteja ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఇక చివరిగా ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మాస్ మహారాజా త్వరలోనే టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.
రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల సక్సెస్ తో జోష్ మీద ఉన్నారు.ఇక ఆయన చేతిలో వరుసగా సినిమాలు ఉన్నాయి.
రావణాసుర సినిమాతో వచ్చిన రవితేజ ఆ సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేదు.అయితే రవితేజ నటిస్తున్న తదుపరి చిత్రం టైగర్ నాగేశ్వరరావు తెలుగు, తమిళ,కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.రవితేజ కెరీర్ లోనే మొదటి పీరియాడిక్ సినిమా ఇది.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.దసరాకు( Dasara ) ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు రవితేజ.ఇక ఈ సినిమా తర్వాత సంక్రాంతికి ఈగల్( Eagle Movie ) అనే మరో సినిమాతో రాబోతున్నాడు.
అయితే ఎప్పుడు షూటింగ్ లతో బిజీబిజీగా గడిపే రవితేజ తాజాగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి జపాన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకున్నాడు రవితేజ.ఆయన తన ఫ్యామిలీతో( Raviteja Family ) కలిసి వెకేషన్ కి వెళ్లారు.తన ఫ్యామిలీతో కలిసి జపాన్ కి( Japan ) వెళ్లారు.
అక్కడ తన ఫ్యామిలితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.అయితే రవితేజ తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడు.
కానీ తాజాగా జపాన్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని రవితేజ షేర్ చేశాడు.దీనితో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఆ ఫోటోల్లో రవితేజతో పాటు రవితేజ సతీమణి కల్యాణి, కూతురు మోక్షద, కుమారుడు మహదన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.ఇప్పుడు ఆ ఫోటోలు బాగా వైరల్ గా మారాయి.