మంచిర్యాల జిల్లా( Mancherial ) మందమర్రిలో ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి, కింద మంట పెట్టి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి ఉండే యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్ కు చెందిన చాకలి రాములు( Chakali Ramulu ) వద్ద కొన్ని మేకలు ఉన్నాయి.ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు.
ఇటీవలే ఒక మేకతో( Goat ) పాటు మేకల షెడ్డు వద్ద ఉన్న ఒక పైపు చోరీకి గురైంది.అయితే ఆ ప్రాంతనికి చెందిన కిరణ్( Kiran ) అనే వ్యక్తి పై అనుమానంతో మేకల యజమాని చాకలి రాములు అతనిని పిలిపించి గట్టిగా ప్రశ్నించడంతో మేకల షెడ్డు వద్ద దొంగలించిన పైపును చూపించాడు.
చోరీకి గురైన మేక గురించి అడిగితే తనకేం తెలియదు అనడంతో స్థానికులు మేకను కూడా కిరణ్ ఎత్తుకెళ్లి అమ్ముకొని ఉంటాడని ఆరోపించారు.

కిరణ్ ను ఎన్నిసార్లు అడిగిన తాను మేకను చోరీ చేయలేదు అనడంతో ఆగ్రహించిన మేకల యజమాని రాములు తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి కిరణ్ ను చిత్రహింసలకు గురిచేశాడు.అంతేకాకుండా కింద మంట కూడా పెట్టాడు.మేకల యజమాని చిత్రహింసలు భరించలేకపోయినా కిరణ్ తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు.
దీంతో తేజను కూడా కట్టేసి చిత్రహింసలు పెట్టాడు.తరువాత పెద్దల వద్ద పంచాయతీ పెట్టగా రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానించగా అందుకు నిందితులు అంగీకరించారు.

అయితే అవమాన భారం భరించలేకపోయిన కిరణ్ కనిపించకుండా పోయాడు.దీంతో కిరణ్ చిన్నమ్మ నీటూరి సరిత పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది.బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కిరణ్ దళితుడు ( Dalit ) కావడంతో రాములు తో పాటు అతని కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ పేర్కొన్నారు.







