టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళీ కూడా ఒకరు.
కమెడియన్ గా నటుడిగా, దర్శకనిర్మాతగా రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు పోసాని.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
నెగిటివ్ క్యారెక్టర్( Negative Characters ) లలో మాత్రమే కాకుండా పాజిటివ్ క్యారెక్టర్ లలో కూడా నటించి మెప్పించారు.

కేవలం సినిమాల విషయంలోనే కాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు( Controversies ) క్రియేట్ చేసే విధంగా కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.మీడియా ముసుగులో బీఆర్నాయుడు( BR Naidu ) బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.
చంపించడం అనేది బీఆర్ నాయుడికి చాలా చిన్న పని అని అన్నారు.ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ.
సినిమా ఇండస్ట్రీపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.ప్రశ్నిస్తే అంతు చూస్తామని నన్ను బెదిరించారు.
బీఆర్ నాయుడికి దివంగత నేత వైఎస్సార్ భిక్ష పెట్టారు.మీడియా ముసుగులో బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు.
ఆడవాళ్లపై టీవీ-5లో నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు.మీ ఇళ్లలో ఆడవాళ్లు లేరా? వారితో కూడా ఇలాగే మాట్లాడుతారా? ఇప్పటికైనా బీఆర్ నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి అంటూ మండి పడ్డారు.

అలాగే నేను ప్రశ్నించినందుకు నన్ను చంపేందుకు కూడా కుట్ర చేస్తున్నారు.ఇవ్వాలా? లేదా రేపో నన్న చంపవచ్చు.బీఆర్ నాయుడు టీవీ5 ( TV 5 )పెట్టినప్పుడు ఓ వ్యక్తి దగ్గర రూ.30కోట్లు అప్పుగా తీసుకుని ఇప్పటికీ ఇవ్వలేదు.మార్వాడీ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని చెదిరింపులకు పాల్పడ్డారు.మీడియాను అడ్రస్ చేయాలంటేనే నాకు భయమేస్తోంది.సినీ పరిశ్రమలో ఉన్న మహిళలను అవమానించినందుకు సాంబశివరావు ఇంట్లో తనను అడగరా? తెలంగాణ ఆడబిడ్డలను తిట్టడానికే బీఆర్ నాయుడు సాంబశివరావు( Sambhashiva Rao )ను టీవీ-5లో పెట్టుకున్నాడు.సాంబశివరావు వాడుతున్న భాషను ఏ ఛానెల్ అయినా వాడుతుందా? సాంబశివరావు వెనుక చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఉన్నారు.నన్ను ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడినా నేను మాట్లాడటం ఆపను అని తెలిపారు.







