టాలీవుడ్ ఇండస్ట్రీలో రియల్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీహరి (Srihari )గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఈయన హీరోగా విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీహరి ముంబైలో ఓ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నఫలంగా గుండెపోటుకి గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే.అయితే తాజాగా శ్రీహరి భార్య డిస్కో శాంతి (Disco Shanthi)ఒక ఇంటర్వ్యూలో పాల్గొనే శ్రీహరి మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా డిస్కో శాంతి మాట్లాడుతూ బావకు గుండెపోటు వచ్చి చనిపోలేదని ఇంజక్షన్స్ వేయడం వల్ల చనిపోయారు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్ళినటువంటి ఆయన ముందు రోజు సాయంత్రం ఫోన్ చేస్తే పిల్లలతో మాట్లాడి రేపు సాయంత్రం వస్తానని చెప్పారు.ఉన్నఫలంగా గుండెపోటుకు గురి కావడంతో ముంబైలోని ఒక హాస్పిటల్లో చేర్పించారు.అయితే అక్కడ డాక్టర్స్ తనకు రాంగ్ ట్రీట్మెంట్ (Wrong Treatment) ఇచ్చారని వారు ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగానే తను చనిపోయారని డిస్కో శాంతి వెల్లడించారు.

ఆయనని హాస్పిటల్లో చేర్చిన తర్వాత నేను వెళ్ళాను కానీ అక్కడ నన్ను లోపలికి రానివ్వలేదు వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు నాకు హిందీ రాదు అలాగే బావ ఎవరు అనే విషయం వారికి తెలియదు.సిస్టర్ నన్ను బయటికి పంపించి తనకు పెట్టిన సెలైన్ బాటిల్ లో ఒక ఇంజక్షన్ వేశారు.ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత బావ చెవుల్లో నుంచి ముక్కులో నుంచి రక్తం రావడం మొదలైంది.ఆ ఇంజక్షన్ (Injection)వేసిన తర్వాత కొద్దిసేపటికి తను చనిపోయారని చెప్పారు.
కచ్చితంగా తనకు వేయకూడని ఇంజక్షన్ వేసారని రాంగ్ ట్రీట్మెంట్ కారణంగానే భావ చనిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అదే హైదరాబాదులో అయితే ఆయన తప్పకుండా బతికేవారు నేడు ఈ ప్లేస్ లో తానే ఉండి ఇంటర్వ్యూ చేసేవారు అంటూ ఈమె మరోసారి శ్రీహరిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.







