జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన కోరుట్ల దీప్తి కేసులో మిస్టరీ వీడింది.దీప్తిని చెల్లెలు చందన హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
బాయ్ ఫ్రెండ్ తో కలిసి చందననే దీప్తిని హతమార్చిందని పోలీసుల విచారణలో తేలింది.
మతాంతర వివాహానికి అడ్డు వస్తుందనే హత్యకు పాల్పడిందని తెలుస్తోంది.
తల్లిదండ్రులు లేని సమయంలో చందన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా చందన మతాంతర వివాహానికి తల్లిదండ్రులతో పాటు దీప్తి కూడా నిరాకరించిందని సమాచారం.