కర్నూలు జిల్లా ఆదోనిలో జనసేన నేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 2024 లో సీఎం పవన్ కళ్యాణ్ కావాలంటూ మోకాళ్లతో మెట్లు ఎక్కిన మహిళ.పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని మరియు ఆదోని ఇంచార్జ్ మల్లప్ప ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ 501 మెట్లు మార్గంలో రాజేశ్వరి యాదవ్ అనే వీర మహిళ మోకాళ్ళతో రణమండల కొండెక్కి ఆంజనేయ స్వామి వారిని దర్షించుకుంది.
ఈ సందర్బంగా అప్పులో ఉన్న ఆంద్రప్రదేశ్ ని అబివృద్ది మార్గంలో నడిపించగల సత్తా ఉన్న ఒకే ఒక నాయకుడు, నిస్వార్థ సేవకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలని అలాగే ఇప్పటివరకు అబివృద్ది నోచుకోని ఆదోని నియోజకవర్గం బాగుపడాలంటే ఆదోని జనసైనికుడు మల్లప్ప MLA కావాలనే దృఢ సంకల్పంతో రణమండల కొండకు మెట్ల మార్గంలో ఉన్న 501 మెట్లను మోకాళ్ళతో ఎక్కి ఆంజనేయస్వామి వారిని దర్షించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు తెలిపింది.







