విజయవాడ:జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడులను ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు.ప్రభుత్వం విధానాల వల్ల దెబ్బ తిన్న రంగాల వారితో కలిసి సహపంక్తి భోజనాలు, అల్పాహారం చేశాం.
రక్తదాన శిబిరాలు, పేదలకు చేయూతను ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాం.జగన్ అనాలోచితంగా చేసిన నిర్ణయాలతో లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారు.
భవన నిర్మాణ కార్మికులు నేటికీ అనేక ఇబ్బంది పడుతున్నారు.నాలుగేళ్లల్లో జగన్ కార్మికులు జీవితాలను నాశనం చేశారు.కార్మికులు కష్టం వింటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి.బటన్ నొక్కే కార్యక్రమాలతో ఆర్భాటం చేయడం కాదు.
పేదలు, కార్మికులు కడుపు నింపే పనులు చేయాలి.అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో కార్మికులు తో కలిసి టిఫిన్ చేశాం.
మా ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది.కార్మికులు ను ఆదుకుంటాం.