పంచదార( sugar ).దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వాడుతుంటారు.
ముఖ్యంగా ఉదయం తాగే టీ, కాఫీలో పంచదార ఉండాల్సిందే.హెల్త్ ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్నవారు మాత్రం వీలైనంతవరకు షుగర్ ను దూరం పెడుతుంటారు.
ఎందుకంటే పంచదార వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.నిత్యం పంచదారను తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు.
గుండె జబ్బులు, మధుమేహం వచ్చే రిస్క్ పెరుగుతుంది.లివర్ క్రమంగా డ్యామేజ్ అవుతుంది.
దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది.మొటిమలు విపరీతంగా వేధిస్తాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యపరంగా పంచదార వల్ల అనేక నష్టాలు ఉన్నాయి.
కానీ సౌందర్య సాధనలో పంచదార బాగా ఉపయోగపడుతుంది.అలాగే జుట్టు సంరక్షణకు కూడా సహాయపడుతుంది.ముఖ్యంగా సిల్కీ హెయిర్ ( Silky hair )ను పొందాలనుకునే వారికి పంచదార అద్భుతంగా సహాయపడుతుంది.
జస్ట్ రెండు స్పూన్ల పంచదారతో సిల్కీ అండ్ షైనీ హెయిర్ తమ సొంతం చేసుకోవచ్చు.అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పంచదార మరియు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( coconut oil ) వేసుకొని బాగా కలుపుకోవాలి.పంచదార మెల్ట్ అయిన తర్వాత అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ తో పాటు రెండు గ్లాసులు గోరువెచ్చని వాటర్ పోసి మరోసారి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా కనుక తల స్నానం చేస్తే జుట్టు ఎంత డ్రై గా ఉన్నా సరే స్మూత్ గా మరియు సిల్కీగా మారుతుంది.
కురులు షైన్ అవుతూ కనిపిస్తాయి.అలాగే ఇప్పుడు చెప్పిన విధంగా షుగర్ ను ఉపయోగించి తలస్నానం చేస్తే స్కాల్ప్ పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.తేమ పెరుగుతుంది.జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.మరియు కురులు చిట్లడం విరగడం వంటివి సైతం తగ్గుతాయి.కాబట్టి సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను పొందాలని కోరుకునేవారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.
బెస్ట్ రిసల్ట్ మీ సొంతం అవుతుంది.