రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ లో చోటు చేసుకున్న దారుణ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.రాజస్థాన్ లో మహిళలకు భద్రత లేదని చెప్పారు.
మహిళలపై వేధింపులు, దాడులు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని వెల్లడించారు.
కాగా ప్రతాప్ గఢ్ లో గ్రామస్తుల ముందే భార్యను వివస్త్రను చేసిన దారుణం జరిగిన సంగతి తెలిసిందే.కుటుంబ కలహాలతో అత్తామామలే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం.