తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు పంపడం తెలిసిందే.అయితే ఈ నోటీసులపై వైసీపీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐటీ నోటీసులపై చంద్రబాబు( Chandrababu naidu ) ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారని ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో పొత్తులు కూడా పెట్టుకుంటున్నట్లు ఆరోపణలు చేశారు.తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే “భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమం చంద్రబాబు అవినీతికి గ్యారెంటీ అని మంత్రి అమర్నాథ్( Minister Amarnath ) సెటైర్లు వేశారు.
ఇదే సమయంలో ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.కేంద్రం కాలు మొక్కడానికి చంద్రబాబు ఢిల్లీ యాత్రలు చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు.ఇదే సమయంలో ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం( NTR Coin ) కార్యక్రమంలో చంద్రబాబు తీరుపై మంత్రి అమర్నాథ్ విమర్శల వర్షం కురిపించారు.







