పార్టీలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Huzurabad BJP MLA Etela Rajender ) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.బీఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా గెలిచిన తనకు మొదట్లో సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తితో ఈటెల ఉండేవారు.
ఇక తర్వాత ఆ అసంతృప్తిని గుర్తించి బిజెపి అధిష్టానం ఆయనకు కీలక పదవిని కట్టబెట్టింది.చేరికల కమిటీ చైర్మన్ గా నియమించింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని కీలక నాయకులను పార్టీలో చేర్పించే బాధ్యతను ఆయనకు అప్పగించింది.ఈ మేరకు బీఆర్ఎస్ , కాంగ్రెస్ లలోని అసంతృప్త నేతలతో ఈటెల మంతనాలు జరుపుతూ బిజెపిలో చేరే విధంగా ఒప్పించేవారు.
కానీ చివరి నిమిషంలో వారు బీజేపీలో చేరడం లేదని ప్రకటించడం వంటివన్నీ ఇబ్బందికరంగా మారాయి.అయితే వారు చేరికలకు సంబంధించి బిజెపి( BJP )లోని కొంతమంది కీలక నేతలు లీకులు ఇవ్వడం వల్లే, ఆ చేరికలు నిలిచిపోతున్నాయని ఈటెల గ్రహించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా తాను పర్యటించేందుకు అనుమతి ఇవ్వడం లేదనే అసంతృప్తితో చాలా కాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డి( BJP Kishan Reddy )కి బాధ్యతలు అప్పగించిన తర్వాత యాక్టివ్ అయినా అసంతృప్తితోనే ఉంటున్నారు.ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు తనకు అప్పగించినా, దానికి తగ్గ పవర్స్ అప్పగించడం లేదనే అసంతృప్తితో ఈటెల ఉన్నారు.చేరికల కమిటీ చైర్మన్ గా ఈటెల తీసుకుంటున్న నిర్ణయాలకు కోర్ కమిటీలో చెక్ పడుతుండడం, బిజెపిలో కొత్తగా ఎవరు చేరాలన్న కోర్ కమిటీ లోనే దానిపై తుది నిర్ణయం తీసుకోవడం తో , కొత్త నేతలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా, కోర్ కమిటీ దానిని ఓకే చేయడం లేదని ఈటల అసంతృప్తి చెందుతున్నారు.
ఇటీవల మాజీ మంత్రి కృష్ణ యాదవ్( Ex Minister Krishna Yadav ) ను బిజెపిలో చేర్చుకునేందుకు ఈటెల ఆయనతో చర్చలు జరిపారు.కాకపోతే ఆయన పార్టీలో చేరకముందే అంబర్ పేట నియోజకవర్గం లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు .దీంతో ఆయన చేరికకు బ్రేక్ పడింది.కృష్ణ యాదవ్ పోటీ చేస్తానన్న అంబర్ పేట నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి ,తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారు.
దీంతో కృష్ణ యాదవ్ చేరికకు బ్రేక్ పడింది.తాను కృష్ణ యాదవ్ చేర్పించేందుకు ఎంతగానో కష్టపడి ఒప్పిస్తే తనకు తెలియకుండానే చేరిక కార్యక్రమాన్ని వాయిదా వేయించారనే అసంతృప్తి ఈటలలో కనిపిస్తోంది ఇదే విధంగా ఎంతోమంది కీలక నేతలు చేరికల విషయంలో పార్టీలోని నాయకులే స్పీడ్ బ్రేకర్లుగా మారడంపై ఈటెల ఈ స్థాయిలో ఫైర్.
అవుతున్నారు.