బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు షారుక్ ఖాన్ (Shah rukh Khan) ఒకరు.నటుడుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన తాజాగా జవాన్ ( Jawan )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాలో షారుక్ సరసన మొదటిసారి నయనతార ( Nayanatara )నటించారు.
ఇక ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీదర్శకత్వం వహించడం విశేషం.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ అట్లీ( Director Atlee ) షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈయన నటి ప్రియా( Director Atlee Wife Priya )ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే 2014వ సంవత్సరంలో వీరి వివాహం జరిగింది.ఎనిమిదేళ్లపాటు సంతానం కోసం ఎదురుచూస్తున్నటువంటి ఈ దంపతులకు ఈ ఏడాది జనవరిలో బాబు జన్మించారు.

ఇక జవాన్ సినిమా షూటింగ్ అమెరికాలో ప్రారంభం అయింది.ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై మూడు రోజులకి హాస్పిటల్ నుంచి నా భార్య( Actress Priya Pregnant ) ఫోన్ చేసి తాను ప్రెగ్నెంట్ అనే శుభవార్తను చెప్పారు.మూడు నెలల పాటు ఎలాంటి పనులు చేయకుండా పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సూచించారు.అయితే ఈ విషయం షారుఖ్ ఖాన్ గారికి తెలియడంతో ఆయన వెంటనే షూటింగ్ కి ప్యాకప్ చెప్పమన్నారు.
అయితే నా భార్య మాత్రం తన పనులు తాను చేసుకోగలరని మీరు మాత్రం షూటింగ్ ఆపొద్దు అంటూ తనకు చెప్పారని తెలిపారు .నా భార్య గురించి ఈ శుభవార్త తెలియడంతో షారుక్ ఖాన్ షూటింగ్( Jawan Shooting ) ఆపేయమని చెప్పడం గొప్ప విషయం అంటూ ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గురించి అట్లీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







