సినిమా ఇండస్ట్రీ లో కమెడియన్లు( Comedians ) చాలా మంది ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కొంచం డిఫరెంట్ కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తున్న వాళ్లలో ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ, సత్య, అభినవ్ గొమట్టం, సుదర్శన్ లాంటి ఆర్టిస్టులు ముందు వరుసలో ఉంటారు నిజానికి వీళ్ళు చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ వీళ్ళకి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు అయితే ఉంది…అయితే వాళ్ల మార్క్ కామెడీ తో అందరిని నవ్విస్తూ సినిమా విజయం లో కూడా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు…

వీళ్ళందరూ కూడా చిన్న సినిమాలకి మీడియం బడ్జెట్ సినిమాకి ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.ఎందుకంటే వీళ్ళు ప్రతి సినిమా లో వచ్చి మంచి కామెడీ చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటూ సినిమాను విజయ తీరాలకి చేర్చుతున్నారు…అందుకే సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం సినిమాలు కమెడియన్స్ మీదనే ఆధారపడి ఆడుతున్నాయి అని చెప్పవచ్చు… ఇక ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ అంటే ప్రస్తుతం చాలా మందికి చిన్న సినిమాలే గుర్తుకు వస్తున్నాయి ఎందుకంటే ఆ సినిమాల్లోనే మంచి కంటెంట్ ఉంటుంది అంతే తప్ప పెద్ద సినిమాల్లో పెద్దగా కంటెంట్ ఏమి ఉండటం లేదనే చెప్పాలి…

ఇక రీసెంట్ గా వచ్చిన సామజ వరగమన( Samajavaragamana ) సినిమాలో సుదర్శన్( Sudarshan ) గానీ వెన్నెల కిషోర్( Vennela Kishore ) గానీ సూపర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక సేవ్ ది టైగర్ సినిమాలో ప్రియదర్శి( Priyadrshi ) గానీ, అభినవ్ గొమట్టం( Abhinav Gomatham ) గానీ చాలా బాగా నటించి మెప్పించారు అనే చెప్పాలి…ఇక ఈ సినిమాలనే కాకుండా రీసెంట్ గా వస్తున్న ప్రతి చిన్న సినిమాల్లో వీళ్లే కమెడియన్ గా నటిస్తూ వాళ్ల టాలెంట్ ను చూపించుకుంటున్నారు.ఇక ఈ సినిమా ఇండస్ట్రీ లోకి ప్రస్తుతం మంచి నటులు వస్తున్నారు.వాళ్ల టాలెంట్ ని రోజు రోజుకీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు…








