కలర్ తప్పితే మొఖంలో కలే లేదు ఈమె హీరోయినా అన్న తమన్నా( Tamanna Bhatia ) ప్రస్తుతం గ్లామర్‌కు కేరాఫ్ గా మారింది.ప్రస్తుతం మిల్కీ బ్యూటీగా సినీ ఇండస్ట్రీలో దశాబ్ధ కాలంగా కొనసాగుతూనే ఉంది.
ఈమె లాంగ్ టైం హీరోయిన్ గా నిలబడగలిగిందంటే తన అందాల ఆరబోతే అనడంలో అతిశయోక్తి లేదు.ఒక పక్క హీరోయిన్ గా మరో పక్క ప్రత్యేక గీతాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.
ప్రస్తుతం తాను చిరంజీవితో భోళాశంకర్, రజనీకాంత్‌తో జైలర్ చిత్రాల్లో నటించారు.ఈ రెండు చిత్రాలు కూడా ఒక్క రోజు తేడాతో విడుదల అయ్యాయి.
వాటిలో రజనీ కాంత్ నటించి రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
విశేషం ఏంటంటే జైలర్( Jailer ) చిత్రంలో తమన్నా రజనీకాంత్‌కు ఫెయిర్ కాదు.ఇక భోళాశంకర్ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటించిన కీర్తీసురేష్‌కే అధిక ప్రాధాన్యత కల్పించారు దర్శకుడు.కాగా ఇద్దరు సీనియర్ హీరోలతో నటించడం గురించి తమన్నాపై నెటజన్లు ఫైర్ అయ్యారు.
కథలో ప్రాధాన్యం లేనప్పుడు సీనియర్ హీరోలతో నటించేందుకు ఎందుకు ఒప్పుకున్నారంటూ ప్రశ్నించారు.అవకాశాలు రాకనా లేక డబ్బుల కోసం ఇలా చేస్తున్నారా అంటూ తమ్ము బేబీ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు.
దీనిపై తమన్నా కూడా స్పందించారు.చేసే పాత్రలు చూడాలని.
నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి మాట్లాడొద్దంటూ ఘాటుగా స్పందిచారు.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో తమన్నా ప్రేమాయణం కొనసాగిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.తమన్నాకు చిన్ననాటి నుంచే హీరోయిన్ కావాలని కలలు కనేదట.దాన్ని నెరవేర్చుకోవడానికి మొదట మోడలింగ్ లోకి అడుపెట్టి.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 16 ఏళ్ల వయసులోనే ‘చాంద్ సా రోషన్ చెహ్రా‘ అనే హిందీ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది.ఆ తర్వాత మంచు మనోజ్ సరసన ‘శ్రీ’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది.
కెరీర్ మొదట్లో చేసిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.దీంతో ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర పడింది.శేఖర్ కమ్ముల తీసిన ‘హ్యాపీ డేస్‘ చిత్రంతో తమన్నా జీవితంలో హ్యాపీ నెస్ మొదలైంది.ఈ సినిమాతో తమన్నా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది.ఇటీవల లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా హాట్ సీన్లు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
ఇక తమన్నా పర్సనల్ విషయాలకి వస్తే తాను డిసెంబర్ 21, 1989న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.తమన్నా తండ్రి పేరు సంతోష్ భాటియా, తల్లి రజనీ భాటియా.
తనకు ఓ సోదరుడు ఉన్నాడు అతడి పేరు ఆనంద్ భాటియా.తమన్నా తండ్రి ఫైనాన్షియల్ కన్సల్టెంట్.
తమన్నా సోదరుడు ఆనంద్ భాటియా( Anand Bhatia ) చూస్తే హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు.ఆనంద్ భాటియా వృత్తిరీత్యా డాక్టర్.
ప్రస్తుతం ఆయన అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాడు.