పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లైనప్ లో ఉన్న సినిమాల్లో ఓజి ( OG Movie )ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”.
ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది అని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

మేకర్స్ ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్.డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు.మరి రిలీజ్ గురించి ముందు ముందు క్లారిటీ రానుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.ఇంతకు ముందుగానే ఓజి టీజర్ రాబోతుంది అని అఫిషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న పుట్టిన రోజు జరుపుకోనున్నారు.ఈ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కాదు అంతకు మించి అని చెప్పడంతో టీజర్ అని కన్ఫర్మ్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ అప్డేట్ కోసం మరోసారి మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు…
ఈ టీజర్ ఉందని చెప్పినప్పటి నుండి ఎప్పుడు రిలీజ్ అవుతుందా టైం చెప్పండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా ( Social media )వేదికగా మేకర్స్ ను అడుగుతూనే ఉన్నారు.దీంతో తాజాగా వీరికి సమాధానంగా మేకర్స్ అదిరిపోయే వార్త చెప్పారు.
ఏ టైం కు సెప్టెంబర్ 2న మనం మొదలు పెట్టాలో మీరే చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ అయితే సాయంత్రం ఫిక్స్ చేద్దాం అని కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో ఓజి విషయంలో టీజర్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.







