ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్( NTR ) ఫోటోతో విడుదల చేసిన 100 రూపాయల నాణెం గురించి చర్చించుకుంటున్నారు.అంతేకాకుండా ఈ నాణెం గురించి ఇక వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఏపీలో రాజకీయమంతా ఈ నాణెం చుట్టూనే తిరుగుతోంది.ఈ నాణెం విడుదల చేయించింది తామేనంటూ క్రెడిట్ కొట్టేందుకు బీజేపీ ( BJP )ఎన్టీఆర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు దక్కేలా చేసింది తామేనంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటున్నాయి.

ఇక ఈ విషయంలోకి వైసీపీ ( YCP )కలుగచేసుకొని వీరి క్రెడిట్ అంతా గంగలో కలిపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది.ఈ క్రమంలోనే లక్ష్మీపార్వతిని రంగంలోకి దింపిందని తెలుస్తోంది.లక్ష్మీ పార్వతి చేత తనను ఎన్టీఆర్ నాణెం( NTR coin ) విడుదల కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకుండా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పించి తద్వారా ఆ రెండు పార్టీలను వైసీపీ అధినేత ఏకకాలంలో టార్గెట్ చేయిస్తున్నారని సమాచారం.అంతేకాకుండా రాష్ట్రంలోని ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది వైసీపీ సర్కారేనని లక్ష్మీపార్వతితో చెప్పిస్తూ క్రెడిట్ కొట్టేందుకు ప్రయత్నించింది.

ఈ అంశంపై వైసీపీ నేతలు మౌనంగా ఉండటం కూడా ఇదంతా వైసీపీయే చేయిస్తోందనడానికి నిదర్శనమని ఏపీలో చర్చించుకుంటున్నారు.ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికీ ( Purandeshwari )బీజేపీ ఏపీ పగ్గాలు అప్పగించడం నాణెం విడుదల చేయడం వంటి అంశాలను వినియోగించుకుని ఏపీలో బలోపేతానికి బీజేపీ స్కెచ్ గీస్తోందని దీని వెనుక భారీగా చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టుకుని కమ్మ సామాజిక వర్గానికి దగ్గరవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు టాక్.ఇక ఎన్టీఆర్ కాయిన్ విడుదల కార్యక్రమానికి హాజరైనా హాజరు కాకపోయిన దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలా? అని వైసీపీ యోచిస్తోంది.కార్యక్రమానికి హాజరయ్యారు కాబట్టి చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారాన్ని అందుకుంది.ఒకవేళ హాజరవకుంటే ప్రచారం మరోలా ఉండేదని అందరికీ తెలిసిందే.
ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, చంద్రబాబు పక్కపక్కన కూర్చొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.దీనిపై టీడీపీ, బీజేపీలను పురందేశ్వరి కలుపుతున్నారని అనిపిస్తోందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.







