సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు తప్ప సినిమా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఎవ్వరు తీర్చరు అని ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది చెబుతూ ఉంటున్నారు.నిజానికి ఇండస్ట్రీ అనేది అందరిది అయినా కూడా ఇక్కడ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటూ కొన్ని సినిమాలకి ఒక న్యాయం ఉంటుంది మరికొన్ని సినిమాలకి మరో న్యాయం ఉంటుంది.
అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు చిన్న సినిమావాళ్లని తోక్కేస్తున్నారు అని చాలా మంది చిన్న నిర్మాతలు కూడా ఎప్పుడు ఏదోఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు.ఎందుకంటే చిన్న నిర్మాతలు చేసే సినిమాలని పండగలకి రిలీజ్ చేసుకోకుండా కొంత మంది నిర్మాతలు థియేటర్లని ముందే బుక్ చేసుకొని పండగ సీజన్ లో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకకుండా చేస్తూ ఉంటారు…

ఇక ఇప్పటికి దాసరి( Dasari Narayana Rao ) గారి తర్వాత ఇండస్ట్రీ కి అసలు పెద్ద అనేవారు ఎవరు లేకుండా పోయారు దాంతో ఇలాంటి భాదలు ఎవరికీ చెప్పుకోవాలో ఎవరికీ తెలియడం లేదు.నిజానికి అయన ఉన్నప్పుడు ప్రతి ప్రాబ్లమ్ కి ఆయనే దగ్గరుండి మరి సొల్యూషన్ చెప్పేవాడు.కానీ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు చిరంజీవి అంతో ఇంతో ఇండస్ట్రీ పెద్ద గా కొన్ని పనులు చేస్తున్నప్పటికీ అయన మీద చాలా మంది బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మోహన్ బాబు( Mohan Babu ) కూడా ఇండస్ట్రీ పెద్దగా చేయాలనీ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అయనని ఇండస్ట్రీ పెద్ద అని ఎవరు ఒప్పుకోవటం లేదు.

ఎందుకంటే అయన కొడుకు అయినా మంచు విష్ణు( Manchu Vishnu ) మా ఎలక్షన్ లో గెలిచి మా ప్రెసిడెంట్ అయిన విషయం మనకు తెలిసిందే…కానీ ఆయన ఎలక్షన్స్ టైం లో తన సొంత డబ్బులతో మా భవనము కట్టిస్తాను అని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తున్నా అసలు ఆ బిల్డింగ్ గురించి ఎక్కడ ప్రస్తావనే తేవడం లేదు.దాంతో మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద గా పనికి రాడు అంటూ చాలామంది సినీ పెద్దలు సైతం చెప్తున్నారు…ఇదంతా ఎందుకు అంటే ఈ మధ్య ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే టాపిక్ మీద మళ్లీ చర్చలు జరుగుతున్నా నేపధ్యం లో సినీ జనాలు అందరు కూడా ఇవే మాటలు చెబుతున్నారు.ఇప్పటికి కూడా చిరంజీవి( Chiranjeevi ) నే సినీ బాగోగులు చూసుకుంటున్నాడు కాబట్టి చిరంజీవి నే ఇండస్ట్రీ పెద్ద అని అందరు భావిస్తున్నారు…
.







