టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఢిల్లీ వెళ్లి చంద్రబాబు అనవసర హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారన్న సజ్జల రాజకీయాలనేవి ప్రజల కోసం ఉండాలని తెలిపారు.2019 వరకు ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలని చంద్రబాబే అన్నారన్న విషయాన్ని సజ్జల గుర్తు చేశారు.గతంలో బీజేపీని తిట్టిన నోటితోనే మళ్లీ పొగుడుతున్నారని విమర్శించారు.ప్రస్తుతం బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోందని తెలిపారు.ఇందుకోసమే జేపీ నడ్డాతో చంద్రబాబు వంగి వంగి మాట్లాడారన్నారు.
పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరన్న సజ్జల టీడీపీ మేనిఫెస్టో వారికే గుర్తు లేదని పేర్కొన్నారు.అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అని సజ్జల ప్రశ్నించారు.







