తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ సుమ( Anchor Suma )ఒకరు.ఈమె కేరళ అమ్మాయే అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా పలు బుల్లితెర కార్యక్రమాలు అలాగే సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉండే సుమ తాజాగా ఓనం( Onam ) పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ప్రతి ఏడాది కేరళ సాంప్రదాయ పద్దతిలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా సుమ ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు.అయితే ఈ పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాంకర్ల( Tollywood Anchors )అందరిని కూడా తన ఇంటికి ఆహ్వానించి వారందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి అందరితో కలిసి ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు.ఇలా ఈ వేడుకకు యాంకర్ రష్మీ అనసూయ రవి నేహా చౌదరి విష్ణుప్రియ, శ్యామల వంటి తదితర యాంకర్స్ అందరూ కూడా హాజరై సందడి చేశారు.ఇలా వీరందరికీ సుమ రాజీవ్ ( Rajeev )ఇద్దరు స్వయంగా వడ్డించారు.
ఈ పండుగ సందర్భంగా పలువురు యాంకర్స్ కేరళ స్టైల్ లోనే ట్రెడిషనల్ దుస్తులు ధరించి సందడి చేశారు.ప్రస్తుతం సుమ ఇంట్లో జరిగినటువంటి ఓనం పండుగ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సుమ కెరియర్ విషయానికి వస్తే ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు వరుస సినిమా వేడుకలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే తప్పకుండా అక్కడ సుమ యాంకర్ గా వ్యవహరించాల్సిందే.
ఇలా యాంకరింగ్ చేయిస్తే సినిమాకు మరింత బజ్ వస్తుందని దర్శక నిర్మాతలు ఈమెకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.