Nagarjuna NTR: కన్న కొడుకును పక్కకు పెట్టి మరి ఆ హీరో పక్కన నిలబడ్డ నాగార్జున.. ఎంత అభిమానమో?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగార్జున( Nagarjuna ) గురించి అందరికీ పరిచయమే.తెలుగు సినీ ఇండస్ట్రీలో మన్మధుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని వారిని అభిమానులుగా మార్చుకున్నాడు.

 Nagarjuna Sides Akkineni Akhil To Stand After Junior Ntr Video Viral-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరో గా నిలిచాడు.మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.

పైగా యంగ్ హీరోలతో పోటీగా నటిస్తున్నాడు.

నాగార్జున తొలిసారి 1986లో విక్రం సినిమాతో( Vikram Movie ) సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

అదే ఏడాది కెప్టెన్ నాగార్జున సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక తొలి సినిమాతోనే మంచి హిట్ ను అందుకోగా ఆ తర్వాత మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి, ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ వంటి ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరో గా నిలిచాడు.

ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.దాదాపు 85 కి పైగా సినిమాలలో నటించాడు నాగార్జున.

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో వ్యాఖ్యాతగా చేశాడు.వాణిజ్య ప్రకటనల్లో కూడా చేశాడు.

ఇక వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు ( Bigg Boss Show )వ్యాఖ్యాతగా చేయగా త్వరలో మరో సీజన్ తో ముందుకు రానున్నాడు.అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సంస్థలో నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.

కేవలం నటుడిగానే కాకుండా పలు బిజినెస్ లు కూడా చేస్తున్నాడు.

ఇదంతా పక్కన పెడితే నాగార్జున వ్యక్తిగతం గురించి కూడా అందరికీ తెలిసిందే.నాగార్జున మొదటి భార్య శ్రీలక్ష్మితో( Sri Lakshmi ) విడిపోయాక అమలను పెళ్లి చేసుకున్నాడు.ఇక మొదటి భార్యకు నాగచైతన్య( Naga Chaitanya ) జన్మించగా, అమలకు అఖిల్( Akhil ) జన్మించాడు.

ఇక తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాగార్జున.కానీ తన వారసులు మాత్రం సరైన హోదాను తెచ్చుకోలేకపోతున్నారు.ముఖ్యంగా అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కొట్టిన సందర్భాలు కూడా లేవు.కొంతవరకు నాగచైతన్య పర్వాలేదని చెప్పాలి.

కానీ కొడుకులు మంచి స్టార్ హోదాకి రావడం కోసం నాగార్జున బాగా ప్రయత్నిస్తున్నాడని చెప్పవచ్చు.ఈ మధ్యనే వారిద్దరి కోసం సపరేట్ మేనేజర్ ని కూడా పెట్టినట్లు తెలిసింది.ఒక నాగార్జున కూడా కొడుకులతో పాటు తను కూడా సినిమాలలో బాగా బిజీగా మారుతున్నాడు.ప్రస్తుతం ఆయన నా సామి రంగ( Naa Saami Ranga Movie ) అనే మూవీలో నటించగా నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్ ను వదిలారు సినీ బృందం.

అయితే ఇదంతా పక్కన పెడితే నాగార్జునకు సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతుంది.అందులో ఒక ఈవెంట్ సందర్భంలో నాగర్జున, అఖిల్, ఎన్టీఆర్, నాగచైతన్య ఫోటో దిగుతూ కనిపించారు.అయితే ఎన్టీఆర్( JR NTR ) పక్కన అఖిల్ ఉండటంతో వెంటనే నాగార్జున అఖిల్ ను పక్కకు జరిపి ఎన్టీఆర్ పక్కన నిలబడ్డాడు.నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియో షేర్ చేస్తూ ఫిదా అయ్యారు.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube