నేడే ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం..మ్యాచ్లను ఫ్రీగా ఎలా చూడాలంటే..?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 టోర్నీ( Asia Cup 2023 ) మరి కొన్ని గంటల్లో ప్రారంభం అవ్వనుంది.తొలిసారి ఆసియా కప్ కు అర్హత సాధించిన నేపాల్, ఆతిథ్య పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్ తో ఈ టోర్నీ ఆరంభం అవ్వనుంది.

 Asia Cup 2023 Tournament Starts Today How To Watch The Matches For Free , Asia C-TeluguStop.com

ముల్తాన్ ఇంటర్నేషనల్ స్టేడియం( Multan International Stadium ) వేదికగా ప్రారంభమయ్యే ఈ టోర్నీకు ఘనమైన ఆరంభ వేడుకలు ఏర్పాటు చేశారు.

Telugu Afghanistan, Asia Cup, Bangladesh, Disney Hot, Latest Telugu, Ar Rahman,

ఈ టోర్నీ ఆరంభ వేడుకలలో భారత సింగర్ ఏఆర్ రెహమాన్ ( Singer AR Rahman )తో పాటు పాకిస్తాన్ సింగర్ అతిప్ అస్లాం( Singer Athip Aslam ) కూడా తన పాటలతో అలరించనున్నాడు.ఇక పలువురు ఆసియా సెలబ్రిటీలు అద్భుతమైన డాన్స్ ప్రదర్శన తో అలరించనున్నారు.ఈ టోర్నీ ప్రారంభ వేడుకలతో పాటు ఈ టోర్నీ అన్ని మ్యాచ్లను అధికారక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేయనుంది.

ఐపీఎల్ తరహాలోనే తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతి లాంటి పలు భాషలలో కామెంట్రీ కూడా ఉండనుంది.స్టార్ స్పోర్ట్స్ కు చెందిన పలు భాషా ఛానల్ లలో క్రికెట్ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

అంతే కాదు స్టార్ స్పోర్ట్స్ కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో ఈ మ్యాచ్లు రానున్నాయి.

Telugu Afghanistan, Asia Cup, Bangladesh, Disney Hot, Latest Telugu, Ar Rahman,

మొబైల్ ఫోన్ యూజర్లు ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా ఆసియా కప్ టోర్నీ మ్యాచ్లను చూసే అవకాశాన్ని డిస్నీ హాట్ స్టార్( Disney Hot Star ) కల్పించింది.ఇక టోర్నీ విషయానికి వస్తే.మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి.

ఈ ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.ఒక గ్రూపులో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా.

మరో గ్రూప్ లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్( Sri Lanka, Afghanistan, Bangladesh ) జట్లు ఉన్నాయి.లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది.అనంతరం రెండు గ్రూపులలో టాప్-2 లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-4 కు అర్హత సాధిస్తాయి.సూపర్-4 లో ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది.అనంతరం టాప్-2 లో నిలిచిన జట్లు ఫైనల్ కు చేరుతాయి.ఈ మ్యాచ్లన్ని భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి.ఈ టోర్నీ లో భారత్- పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 2 శనివారం జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube