విమానం ఎక్కే ముందు బరువు చూసుకోమని చెబుతోన్న ఎయిర్‌ లైన్స్‌!

విమానం ఎక్కే ముందు లగేజీ బరువును( Luggage Weight ) చెక్ చేసుకోవడం అనే అంశం కొత్తదేమీ కాదు.విమాన ప్రయాణీకుల లగేజ్‌ ఎక్కువగా ఉంటే బరువు తగ్గించుకోవలసిన అవసరం ఉంటుంది.

 Why Korean Airline Will Weigh Passengers Before Boarding Details, Airlines , Lat-TeluguStop.com

లేదంటే, కొన్ని సందర్భాల్లో భారీగా పెనాల్టీ( Penalty ) చెల్లించవలసి రావచ్చు.లేదంటే లగేజీని అక్కడే వదిలేసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఏర్పడవచ్చు.

కానీ, ఇక నుంచి ఈ ఫ్లైట్ ఎక్కే ముందు మీ లగేజీ బరువు మాత్రమే కాదండోయ్… మీ బరువు కూడా చెక్ చేసుకోవాలి మరి.అవును, మీరు విన్నది నిజమే.ఎయిర్ న్యూజిలాండ్ తర్వాత ఇప్పుడు మరో అతిపెద్ద విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

Telugu Plane, Passangers, Korean Air, Korean Airline, Latest, Korea-Latest News

దక్షిణ కొరియా( South Korea ) అతిపెద్ద విమానయాన సంస్థ అయిన కొరియన్ ఎయిర్‌లో( Korean Air ) ప్రయాణించే ప్రయాణీకులు ఫ్లైట్ ఎక్కే ముందు తమ బరువు తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.కొరియన్ ఎయిర్ తన వెబ్‌సైట్‌లో విమాన భద్రత కోసం వారి క్యారీ-ఆన్ వస్తువులతో పాటు ప్రయాణీకుల సగటు బరువును కొలవాల్సి ఉంటుందని ధృవీకరించింది.ఇదే విషయమై గేట్ల ముందు, ఫ్లైట్‌ ఎక్కే ముందు బరువు పరీక్ష నిర్వహించబడుతుందని కొరియా టైమ్స్ నివేదించింది.

ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు గింపో అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికుల కోసం ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించిన సంగతి విదితమే.

Telugu Plane, Passangers, Korean Air, Korean Airline, Latest, Korea-Latest News

ఈ ప్రక్రియలో భాగంగా అసౌకర్యంగా ఉన్న ప్రయాణీకుల కోసం, ప్రయాణీకుల సామాను రెండూ అనామకంగా తూకం వేయబడతాయని విమానయాన సంస్థ చెప్పుకు రావడం గమనార్హం.మొత్తం డేటాను సేకరించిన తర్వాత అది కొరియా భూమి, మౌలిక సదుపాయాలు, రవాణా మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం చేయబడుతుంది.విమానయాన సంస్థలు తమకు ఎంత ఇంధనం అవసరమో, విమానంలో బరువును( Body Weight ) ఎలా షేర్‌ చేయాలో నిర్ణయించడంలో సహాయపడుతుందన్నారు.

అంతేగానీ, అధిక బరువు ఉన్న ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని దీని అర్థం కాదు అని ఎయిర్‌లైన్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube