దేశ వ్యాప్తంగా ఉన్న ఉజ్వల యోజన గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది.వంట గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించింది.ఈ మేరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.సిలిండర్ పై రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే అదనపు రాయతీ ప్రతిపాదనలకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది.కాగా ఉజ్వల లబ్దిదారులకు ఇప్పటికే రూ.200 తగ్గింపు ధరకు సిలిండర్ అందుతుండగా కేంద్రం తాజా నిర్ణయంతో మరో రూ.200 తగ్గింపు వర్తిస్తుంది.కాగా ఈ ప్రయోజనం తక్షణం అమల్లోకి వస్తుందన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా 75 లక్షల కనెక్షన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.