వంట గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గింపు

దేశ వ్యాప్తంగా ఉన్న ఉజ్వల యోజన గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది.

వంట గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించింది.

ఈ మేరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.సిలిండర్ పై రూ.

200 సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.ఈ క్రమంలోనే అదనపు రాయతీ ప్రతిపాదనలకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది.

కాగా ఉజ్వల లబ్దిదారులకు ఇప్పటికే రూ.200 తగ్గింపు ధరకు సిలిండర్ అందుతుండగా కేంద్రం తాజా నిర్ణయంతో మరో రూ.

200 తగ్గింపు వర్తిస్తుంది.కాగా ఈ ప్రయోజనం తక్షణం అమల్లోకి వస్తుందన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా 75 లక్షల కనెక్షన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.

హ్యాట్రిక్‌తోపాటు 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన సుమన్ కుమార్