ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ( TDP ) పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబుకి( Chandrababu Naidu ) ఏది కలిసిరావడం లేదు.
గత కొన్నాళ్లుగా జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు కోసం ఆరాటపడుతున్నప్పటికి సత్ఫలితాలు కనిపించడంలేదు.దానికి తోడు ఎన్నికలకు సింగిల్ గా వెళితే వైసీపీని ఎదుర్కోగలమా అనే భయం కూడా చంద్రబాబును వేధిస్తోంది.
అందుకే ఆయనే ఒక అడుగు కిందకు దిగి వ్యూహాలు రచించే ప్లాన్ లో ఉన్నారు.ఈసారి ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
దాంతో చివరిగా ముఖ్యమంత్రి పదవి అధిష్టించి రాజకీయాలకు విరామం చెప్పాలనే ప్లాన్ లో బాబు ఉన్నారు.

అయితే సిఎం పదవి విషయంలో అటు జనసేన అధినేత పవన్.( Pawan Kalyan ) ఇటు బీజేపీ పార్టీ కూడా రేస్ లో ఉండడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.మూడు పార్టీల మద్య పొత్తు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడానికి సిఎం అభ్యర్థి( CM Candidate ) విషయంలో ఏర్పడిన కన్ఫ్యూజనే అనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.అందుకే వైసీపీని ఓడించాలంటే( YCP ) పొత్తు కట్టాల్సిందే.కాబట్టి చంద్రబాబు సిఎం అభ్యర్థి విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నారని పోలిటికల్ ఇన్ సైడ్ టాక్.
మూడు పార్టీల పొత్తు ఏర్పడి అధికారంలోకి వస్తే బీజేపీ మరియు జనసేన తరుపున పవన్ రెండున్నర ఏళ్ళు, చంద్రబాబు రెండున్నర ఏళ్ళు సిఎం పదవి అధిష్టించే ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా ఏపీ బీజేపీ నేతలతో( BJP ) చంద్రబాబు భేటీ అయ్యారు కూడా.స్వర్గీయ నందమూరి తారకరామారావు( Sr NTR ) పేరిట రూ.100 స్మారక నాణెం విడుదల తరువాత ఎవరు ఊహించని విధంగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మరియు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు భేటీ అయినట్లు టాక్ నడుస్తోంది.ఈ భేటీలో ప్రధానంగా పొత్తు అంశాలనే ప్రస్తావించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.దాదాపు పొత్తు విషయం తుది అంకానికి వచ్చినట్లు తెలుస్తోంది.మరి బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయితే జనసేనతో కూడా ఖాయమే.మరి ఈ మూడు పార్టీల మద్య పొత్తుపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.







