'సలార్' నైజాం రైట్స్ సోల్డ్.. ఏకంగా అన్ని కోట్లతో డీల్ పూర్తి!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ పోతున్నాడు.అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.

 Prabhas' Salaar Nizam Rights Completed Huge Price, Salaar, Salaar Nizam Rights,-TeluguStop.com

మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో సలార్( Salaar ) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు.దీంతో సలార్ మూవీ టీజర్ తోనే మాసివ్ బిజినెస్ చేసుకుంటుంది.

వరల్డ్ వైడ్ గా మాసివ్ బిజినెస్ చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా నైజాంలో ఈ మూవీ ఎంత బిజినెస్ చేసిందో తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారట.

ఒక్క నైజాం లోనే ఈ సినిమా 65 కోట్లకు అమ్ముడు పోయిందట.మరి దిల్ రాజు డీల్ సొంతం చేసుకోవడంతో రిలీజ్ కూడా అదే రేంజ్ లో ఉండనుంది.కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

ఆదిపురుష్( Adipurush ) వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోని ప్రభాస్ కు ఇది ఆ రేంజ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.చూడాలి మరి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube